విభజన టైంలో కిరణ్ చీట్ చేశారు: బొత్స, జగన్ కోసం బెజవాడలో చక్రం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ తప్పులేదని, నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చీట్ చేశారని పీసీసీ మాజీ అధ్యక్షులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బొత్స సత్యనారాయణ ఆదివారం చెప్పారు.

ఆయన విజయవాడలో కాపు నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సామాన్యుడి పార్టీగా తయారు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు నష్టం చేసిందని చెప్పనని అన్నారు. అయితే, ఎన్నికల అనంతరం ఏడాదికా చేసిన పోరాటంతో ఎలాంటి ఫలితం రాలేదన్నారు.

తాను తన అనుచరులు, కార్యకర్తల కోసమే వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. విభజనలో కాంగ్రెస్ తప్పులేదని, చీట్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యుడన్నారు.

 Congress cheated by Kiran Kumar Reddy: Botsa on AP division

వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఎప్పుడు?

జగన్ చేపట్టనున్న సమరదీక్ష అనంతరం బొత్స వైసీపీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జగన్ దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలో బొత్స పాల్గొంటారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరనున్నారు.

జగన్ కోసం చక్రం తిప్పుతున్న బొత్స

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైన బొత్స విజయవాడలో బిజీగా గడుపుతున్నారు. వైసీపీ వైపు వస్తున్న వారితో రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. నేరుగా కలవలేని వారితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. బొత్స ప్రయత్నాలను కట్టడి చేసేందుకు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కేవీపీలు ప్రయత్నిస్తున్నారు. తనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను వైసీపీ వైపు తీసుకెళ్లాలని బొత్స భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+