కెసిఆర్ మెడలో కాంగ్రెస్ కండువా: నవ్వుతూ ముందుకు

Congress kanduva on KCR neck
హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెడలో కాంగ్రెసు పార్టీ కండువా మెరిసింది. శనివారం ఆయన మెడలో ఓ కాంగ్రెసు నాయకుడు కాంగ్రెసు పార్టీ కండువా వేశారు.

శనివారం ఒక వివాహానికి హాజరయ్యేందుకు కెసిఆర్ సిద్దిపేట నుంచి హుజురాబాద్ వెళుతూ భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆగారు. ఈ సందర్భంగా తెరాస సర్పంచ్‌లు ఆయనను శాలువాతో సత్కరించారు.

తర్వాత వాహనం ఎక్కి వెళ్లబోతుండగా యూత్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు కెసిఆర్ మెడలో కాంగ్రెస్ కండువా వేశారు. ఆ కండువాను మెడలోనే ఉంచుకుని కెసిఆర్ నవ్వుతూ ముందుకు సాగారు.

కాగా, హైదరాబాద్‌పై ఏ విధమైన ఆకంక్షలను కూడా తాము అంగీకరించబోమని కెసిఆర్ అన్న విషయం తెలిసిందే. 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు తమ తెలంగాణ రాష్ట్రానికే ఎందుకన్నారు. శాంతిభద్రతలను కేంద్ర ఆధీనంలో ఉంచుకోవాలనే ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై ఆంక్షలు పెడితే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+