ప్రత్యేక హోదా కోసం టిడిపి ఇప్పటికైనా పోరాడాలి: సి. రామచంద్రయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామని ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత సి. రామచంద్రయ్య స్వాగతించారు.ప్రత్యేక హోదాపై టిడిపి ఇప్పటికైనా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రామచంద్రయ్య సూచించారు.

కడపలో మంగళవారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి అన్యాయం జరిగిందని రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ జెఎఫ్‌సి పేరుతో కాలాయాపన చేయడమేనని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.పీకి జరిగిన అన్యాయంపై కమిటీ వేయాలని రామచంద్రయ్య పవన్ కళ్యాణ్‌కు సూచించారు.

Congress leader Ramachandraiah slams on Chandrababu

ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు కలిసి బిజెపిపై పోరాటం చేయాలని రామచంద్రయ్య సూచించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు చేయాలని తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

ఇదే తరహలోనే టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు కూడ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకుగాను ప్రయత్నించాలని కాంగ్రెస్ నేత రామచంద్రయ్య సూచించారు. ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader C. Ramachandraiah welcomed Ysrcp chief Ys Jagana statement on special status issue. He spoke to media on Tuesday at Kadapa.Ysrcp chief Ys Jagan announced that its party MPs will be resign on April 6 for special status issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X