వ్యూహాత్మకమా: రాజ్యసభకు కెవిపి, ఎంఏ ఖాన్?

న్యూఢిల్లీ: కెవిపి రామచంద్ర రావు, ఎంఏ ఖాన్, కొప్పుల రాజుల పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెసు పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే, పై ముగ్గురి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వారి పేర్లను సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. నంది ఎల్లయ్య పేరు కూడా వినిపిస్తోంది.

తెలంగాణ బిల్లు నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నుండి పలువురు సమైక్యవాదం పేరుతో రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. జెసి దివాకర్ రెడ్డి, గంటా శ్రీనివాస రావు, చైతన్య రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.

KVP Ramachandra Rao

ఈ నేపథ్యంలో కెవిపి రామచంద్ర రావును నిలబెడితే ఎక్కువ మంది మద్దతిచ్చే అవకాశం ఉండటమే కాకుండా కొంత రెబల్ సమస్య తగ్గే అవకాశముంది. ఈ కారణంతో అధిష్టానం కెవిపి పేరును మరోసారి తెరపైకి తీసుకు వచ్చిందంటున్నారు. కెవిపి పైన అధిష్టానం ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది. కెవిపిని నిలబెడితే కొంత ఇబ్బందులు తగ్గవచ్చునని పలువురు చెప్పినట్లుగా సమాచారం.

మరోవైపు, రాజ్యసభ ఎన్నికలలో పోటీ విషయమై ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తనను రాజ్యసభ బరిలో దింపాలని పలువురు సీమాంధ్ర సభ్యులు కోరుతున్నారని, ఏమవుతుందో చూద్దామని ఉండవల్లి వ్యాఖ్యానించారట. అన్నదమ్ముల వలె కలిసుందామని, విభజన వద్దని కూడా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+