ఏపీ ఓటర్లకు కాంగ్రెస్ తొలి గ్యారెంటీ -ఇంటింటికీ నెలకు 5 వేలు- జగన్ పై షర్మిల ఫైర్..

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగా ఇవాళ అనంతపురంలో న్యాయసాధన సభ నిర్వహించింది. ఇందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేసే తొలి గ్యారంటీ హామీని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంటింటికీ నెలకు ఐదు వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.

అనంతపురం సభలో ముందుగా మాట్లాడిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తాను ఇక్కడికి వచ్చింది శ్రీమంతుల కోసం కాదని, ఏపీలో పేద ప్రజలకు ఓ పథకం గురించి చెప్పడానికని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఒక గ్యారెంటీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి తాను అనంతపురం వచ్చినట్లు చెప్పారు. ఇందిరమ్మ అభయం గ్యారెంటీని ఇస్తున్నట్లు ఖర్గే వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ ఇచ్చింది అంటే అమలు చేసి తీరుతోందన్నారు.

congress party announced first guarantee in anantapur meeting, promise 5k to every family

ఈ గ్యారెంటీ తమ గుండెల్లో ఉంటుందని, మీ గుండెల్లో ఉండాలని ఓటర్లకు ఖర్గే సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గత 10 ఏళ్లుగా తీరని అన్యాయం జరిగిందని, ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆంధ్రకు రాలేదని ఖర్గే వెల్లడించారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ దేశం గర్వించే వైఎస్ రాజశేఖర్ లాంటి గొప్ప నాయకుడిని అందించిందని, మహానాయకుడి బిడ్డను ఈ రాష్ట్రానికి నాయకురాలు చేశామన్నారు. షర్మిల రెడ్డి న్యాయకత్వాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు.

congress party announced first guarantee in anantapur meeting, promise 5k to every family

ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవనే అని ఖర్గే తెలిపారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ కి చంద్రబాబు, జగన్ అమ్మేశారన్నారు. ఏపీకి ఒకరోజు షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ రైతుల పక్షం,పేదల పక్షం,మహిళల పక్షమే అన్నారు. మోడీ మాత్రం మన సొమ్ము కార్పొరేట్ లకు దోచి పెడుతున్నాడన్నారు. మోడీ ఈ దేశాన్ని మోసం చేస్తుంటే... ఏపిలో ముగ్గురు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. మోడీకి జగన్,చంద్రబాబు,పవన్ జీ హుజూర్ అంటున్నారని విమర్శించారు.

congress party announced first guarantee in anantapur meeting, promise 5k to every family

మరోవైపు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మరోసారి అన్న, సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, రాలేదని జగనన్న దీక్షలు చేశారని, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు రాదని షర్మిల ప్రశ్నించారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారన్నారు. 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ హామీ ఇచ్చి ఆరు వేల పోస్టులతో దగా డీఎస్సీ ఇచ్చారన్నారు. చెల్లి అని కూడా చూడకుండా తనపై, తన భర్తపై దూషణలకు దిగుతున్నారని జగన్ పై విమర్శలు చేశారు. మీరేం చేస్తున్నారో దేవుడు చూస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+