ఆ బిల్లును ఆమోదించకూడదని రాష్ట్రపతికి ఏపీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ:2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు బుదవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులు రాష్ట్రపతిని కలిశారు.
2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతికి వివరించారు. ఈ సవరణలు రైతులకు, కూలీలకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతికి వివరించారు.

అయితే ఈ విషయమై న్యాయపరమైన అంశాలను పరిశీలించనున్నట్టు రాష్ట్రపతి హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం స్పూర్తికి విరుద్దంగా టిడిపి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
రైతులకు ప్రయోజనాలను తగ్గించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కల్గించేలా ఈ సవరణలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.












Click it and Unblock the Notifications