కాంగ్రెస్ పార్టీకి రుద్రరాజు పద్మరాజు రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు పార్టీని వీడారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం టీడీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఎంత కష్టపడినా గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, యువజన కాంగ్రెస్ నుంచి పీసీసీ వరకు దాదాపు 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. రుద్రరాజు పద్మరాజు రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతినిధిగా అభ్యర్థుల ఎంపికలో పాలుపంచుకున్నారు.












Click it and Unblock the Notifications