చింతా మోహన్ షాకింగ్-ఇండియా ఫర్ సేల్-అమరావతికి రాహుల్-నవరంధ్రాలూ మూసేస్తున్న జగన్
ఎప్పుడూ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ మరోసారి జూలు విదిల్చారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ నుంచి మొదలుపెట్టి వైఎస్ జగన్, చంద్రబాబు వరకూ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పాటు అమరావతి వ్యవహారం వరకూ అన్ని విషయాలపైనా చింతా మోహన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఓసారి చూద్దాం...

చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్
ఏపీ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలకు పేరొందిన అతి కొద్ది మంది నేతల్లో తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా ఒకరు. సమకాలీన రాజకీయాలపై, ముఖ్యంగా కేంద్ర, రాష్టాల్లో అధికార పార్టీలపై ఆయన ఈ మధ్య తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిలోనూ ప్రధాని మోడీ, వైఎస్ జగన్ పై చింతా మోహన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను సైతం ఆయన తూర్పారపట్టారు. ఇందులో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా ఉన్నాయి.

ఇండియా ఫర్ సేల్- అందులో మోడీ ఫస్ట్
ప్రస్తుతం మన దేశంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై స్పందించిన చింతా మోహన్... భారతదేశాన్ని అమ్మకానికి పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్ధలు అమ్మకానికి పెట్టిన మొట్టమొదటి ప్రధాని మోడీ అని, వేలకోట్ల పెట్టి విమానాలు కొని తిరుగుతున్న మొట్టమొదటి ప్రధాని మోడీ అని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. క్యాబినెట్ సమావేశానికి ఆలస్యంగా వస్తారు కానీ ఏఒక్క మంత్రి గొంతు వినపడదంటూ మోడీని ఉద్దేశించి చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. చివరకు విద్యుత్ డిస్కంలు అమ్మకానికి పెట్టిన ఘనుడంటూ మోడీపై విమర్శలు గుప్పించారు. రైతులను జీపులతో గుద్ది చంపించిన తొలి ప్రధాని మోడీ అంటూ మరో షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం దేశంలో గడ్డుకాలం నడుస్తోందన్నారు.

నవరంధ్రాలూ మూసేస్తున్న జగన్
ఏపీ విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లబోతుందని చింతా మోహన్ తెలిపారు. నవరత్నాల పేరుతో పేదల నవరంధ్రాలు మూసివేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్ అంటూ మరో షాకింగ్ కామెంట్ చేశారు. విద్యార్థులకు స్కాలర్ షిప్పులు లేవు చదువుకోవాలంటే పేదవిద్యార్ధి అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. త్వరలో విద్యార్థుల ఆత్మహత్యలు ప్రారంభమవుతాయంటూ చింతా మోహన్ జోస్యం చెప్పారు. అందుకే 80లక్షల విద్యార్ద్యులకు స్కాలర్షిప్స్ నవంబర్1వ తారికు లోపల ఇవ్వాలని డిమాండ్ చేశారు...అనేకమంది రాజకీయ నాయకులు స్కాలర్షిప్ లతో చదుకున్నవారు కోకొల్లలంటూ చింతా మోహనా్ గుర్తు చేశారు. పేదవాడికి అన్యాయం జరుగుతుంది సంపన్నులకు బీజేపీ కొమ్ముకాస్తుంది...

చంద్రబాబు తొందరబాబన్నారు...
రాష్ట్రంలో ఆదాని అభివృద్ధి కాదు పేదల అభివృద్ధి కావాలని చింతా మోహన్ తెలిపారు. చంద్రబాబు తొందరబాబు అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడేం జరుగుతందంటూ ఆయన ప్రశ్నించారు. రాజధాని రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి చేరువయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చింతా మోహన్ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాజధాని మహిళా రైతుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుందని జోస్యం చెప్పారు. ప్రతి దళిత క్రిస్టియన్ కు ఎస్సి స్టేటస్ వచ్చేవిదంగా పోరాటం చేస్తామని తెలిపారు..

అమరావతికి రాహుల్ గాంధీ
రాజధాని రైతులకోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి పనిచేస్తుందని చింతా మోహన్ హామీ ఇచ్చారు. ఇందుకోసం రాహుల్ గాఁధీని సైతం అమరావతికి తీసుకు రాబోతున్నట్లు చింతా మోహన్ తెలిపారు. ఇప్పటికే అమరావతి కోసం టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్న నేపథ్యంలో రాహుల్ కూడా జత కలుస్తారనే విధంగా చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గతంలో ప్రధాని మోడీ శంఖుస్ధాపన చేసిన అమరావతికి రాహుల్ వస్తే అది మరో సంచలనం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Recommended Video

1990లోనే ఏపీ విభజన జరిగిపోయింది...
మరోవైపు ఏపీ విభజనకు సంబంధించి చింతా మోహన్ షాకంగ్ వ్యాఖ్యలు చేశారు. 1990లో డిసెంబర్ నెలలోనే ఏపీని విభజించారని, కానీ అది ఎవ్వరికీ తెలియదని చింతా మోహన్ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. విభజన తరువాత కాంగ్రెస్ మీద అపవాదు వేశారు, కానీ విభజన కారకులు మాత్రం హీరోల్లాగా తిరుగుతున్నారని ఆయన ఆక్షేపించారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ శ్రీరామ రక్షగా ఉంటుందని చింతా మోహన్ తెలిపారు.












Click it and Unblock the Notifications