వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కసరత్తు చేయలేదా: ఏ పార్టీ ఎటు, అవిశ్వాసం చర్చకు వస్తుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ !

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించ తలపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ దానిపై సరిగా కసరత్తు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెసు తీరు పట్ల కాంగ్రెసు పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. వైసిపి తగిన కసరత్తు చేయలేదని అంటున్నారు. కసరత్తు చేసి ఉంటే బాగుండేడని కాంగ్రెసు నేత మల్లికార్జున్ ఖర్గే వ్యక్తం చేసిన అభిప్రాయం ఆ విషయాన్నే తెలియజేస్తోంది.

చర్చకు రావాలంటే...

చర్చకు రావాలంటే...

జీరో అవర్‌లో స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నోటీసును సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. నోటీసుకు 50 మంది ఎంపీల మద్దతు ఉంటే అవిశ్వాసం చర్చకు వస్తుంది. అయితే, తాము వివిధ పార్టీలతో చర్చించామని, 50 మంది సభ్యుల మద్దతు లభిస్తుందని వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు.

కాంగ్రెసు అసంతృప్తికి కారణం ఇదీ..

కాంగ్రెసు అసంతృప్తికి కారణం ఇదీ..

వైసిపి సరిగా కసరత్తు చేయకపోవడం వల్ల అవిశ్వాస తీర్మానం ఫలితం సాధించే అవకాశం లేదని అంటోంది. పైగా, ప్రతిపక్షాల ఐక్యత దెబ్బ తినే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై 48 మంది సభ్యులు గల కాంగ్రెసుతో కలిసి కసరత్తు చేయాల్సి ఉండిందని అంటున్నారు. వైసిపి నేతలు కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీని గానీ, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీని కలిసి పకడ్బందీ వ్యూహాన్ని రచించి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అవిశ్వాసానికి టిఆర్ఎస్ దూరమే...

అవిశ్వాసానికి టిఆర్ఎస్ దూరమే...

వైసిపి ప్రతిపాదించే అవిశ్వాసానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఆ పార్టీ ఇంకా సందిగ్ధంలో ఉంది. పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నుంచి ఎంపీలకు ఇప్పటి వరకు కచ్చితమైన ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. టిఆర్ఎస్‌కు 11 మంది సభ్యులున్నారు.

చంద్రబాబు కూడా దూరం...

చంద్రబాబు కూడా దూరం...

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. సొంతంగా మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించే నిర్ణయానికి టిడిపి వచ్చింది. టిడిపికి 16 మంది శానససభ్యులున్నారు.

ఎవరు మద్దతు ఇస్తారు...

ఎవరు మద్దతు ఇస్తారు...

తమ నోటీసుకు 50 మంది సభ్యుల మద్దతు లభిస్తుందని వైసిపి ధీమా వ్యక్తం చేస్తోంది. తృణమూల్ కాంగ్రెసు, సిపిఎం, ఎస్పీ వంటి పార్టీలు మద్దతు ఇస్తాయని ఆ పార్టీ భావిస్తుంది. తృణమూల్ కాంగ్రెసుకు 34 మంది సభ్యులున్నారు. 20 మంది సభ్యులున్న బిజెడి కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. అయితే, నోటీసు సభలో ప్రస్తావనకు వచ్చినప్పుడు గానీ అసలు పరిస్థితి తెలియదు.

English summary
Congress expressed unhappy with YS Jagan's YSR Congress on No Confidence motion proposedon PM Narendra Modi government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X