ఓటరు నాడి తేల్చిందేంటి - గెలవాలంటే ఆ ఒక్కటే అడ్డు..!!
ఏపీలో ఓటరు నాడి ఏం చెబుతోంది. ఏపీలో గెలిచేదెవరు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి, వైసీపీ మధ్య గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది. ఈ సమయంలో అనేక సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి. పార్టీలు మాత్ర తమ గెలుపు పై ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సెంటిమెంట్ అంశాలు తెర మీదకు వస్తున్నాయి. అనంతపురం జిల్లా కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితం పైన ఆసక్తి పెరుగుతోంది.
గెలుపు దక్కేదెవరికి
శింగనమల నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విభిన్న పరిస్థితి ఏర్పడింది ఈ ఎన్నికల్లో వైసిపి, అభ్యర్థి, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి-టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పోటీలో నిలిచారు. నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇందులో ప్రధానంగా వైసిపి, టిడిపి మధ్యన నువ్వా నేనా అన్న విధంగా గట్టి పోటీ సాగుతోంది. ఇక్కడ వైసీపీ నుంచి వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బండారు శ్రావణి శ్రీ బరిలో ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో టిప్పర్ డ్రైవర్ కు వైసీపీ టికెట్ ఇచ్చింది అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

వైసీపీ వర్సస్ టీడీపీ
నామినేషన్ సమయంలోనూ టిప్పర్ లోనే వచ్చిన వైసీపీ అభ్యర్ది వీరాంజనేయులు గెలుపు పైన ధీమాగా ఉన్నారు. టీడీపీ నుంచి బండారు శ్రావణి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో అంశాలను, సూపర్ సిక్స్ హామీలను వివరిస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థిగా రెండు సార్లు శాసనసభ్యులుగా గెలిచిన మాజీ మంత్రి శైలజానాథ్ తన హయాంలో సింగనమల నియోజకవర్గంలో జరిగిన అభివఅద్ధిని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో శైలజానాథ్ దూసుకుపోతున్నారు. శైలజనాధ్ ఎమ్మెల్యే, మంత్రి, పీసీసీ చీఫ్ గా పని చేసారు. నియోజకవర్గంలో రెండు పార్టీల నుంచి కొత్త అభ్యర్దులు బరిలో ఉండటంతో...శైలజానాధ్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

త్రిముఖ పోరు
అయితే, ఇక్కడ సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్దులకు ఆ పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు అందటం లేదనే అభిప్రాయం ఉంది. ఏపీ అసెంబ్లీలో 2014,2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. ఈ సారి కాంగ్రెస్ కు ఓట్లు పెరుగుతాయనే లెక్కలు, స్థానిక సమీకరణాలు తమకు బలంగా మారుతాయని శైలజానాధ్ మద్దతు దారులు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్ది వీరాంజనేయులు గెలుపు ఇక్కడ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..శింగనమలలో సర్వేల లెక్కలు నిజం అవుతాయా. అనూహ్య ఫలితం వెల్లడవుతుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications