వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదాపై జైట్లీ కుండబద్దలు: బాబు సేఫ్, ఏం చేస్తారు, జగన్‌కు చిక్కేనా ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ రాజ్యసభలో శుక్రవారం నాడు దాదాపు కుండబద్దలు కొట్టడారు. జైట్లీ హామీ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వాకౌట్ కూడా చేసింది. ఏపీలో ఇవి బీజేపీకి చిక్కులు, ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట అని చెప్పవచ్చు. అయితే, చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేక హోదా ఇవ్వమని జైట్లీ సూటిగా చెప్పనప్పటికీ, ఇవ్వమని పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. మిగతా రాష్ట్రాలు అడుగుతున్నాయని, ఏపీకి అంతకంటే ఎక్కువే చేస్తున్నామని, రాజధాని సహా చాలా వాటికి నిధులు ఇచ్చామని, హోదాపై ఎన్డీయే నిర్ణయిస్తుందని.. చెప్పారు.

హోదాపై ఎన్డీయే నిర్ణయిస్తుందని చెప్పినప్పటికీ, ఆయన మాటల ద్వారా హోదా రాదనే విషయం అర్థమైందని అంటున్నారు. ఇది ఏపీలో బీజేపీకి ఇబ్బందిక పరిణామమే. ఇప్పటి దాకా బీజేపీ పైన పెట్టుకున్న ఆశలు కూడా పూర్తిగా సన్నగిల్లాయి.

Congress walks out of RS over implementation of AP Reorganisation Act

ప్రత్యేక హోదా విషయంలో విపక్ష వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు టిడిపిని, బీజేపీని తప్పుబడుతున్నాయి. టిడిపి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి గట్టిగానే నిలదీసింది. అంతేకాదు కేవీపీ బిల్లుకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఎటూ చిక్కుల్లో పడింది బీజేపీనే.

అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ తేల్చినందున ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని, సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేస్తామని టిడిపి నేతలు పలుమార్లు వ్యాఖ్యానించారు. అంటే, ఇప్పుడు కేంద్రం నుంచి బయటకు వస్తారా అనే చర్చ సాగుతోంది.

చంద్రబాబు కేంద్రం నుంచి బయటకు రాకుంటే, అది జగన్‌కు ఆయుధంగా మారనుంది. హోదా పైన మరోసారి బీజేపీ తేల్చి చెప్పిందని, ఇలాంటప్పుడు బయటకు రాకుంటే ఎలాగని వైసిపి మరింత ఉద్యమిస్తుంది.

నవ్యాంధ్ర భవిష్యత్తుకు కేంద్రంతో సఖ్యత అవసరమని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఏపీ భవిష్యత్తు కోసం చంద్రబాబు బీజేపీతో కలిసే ఉంటారా లేక ఏపీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోకుండా ఉండేదుకు, జగన్ చేతికి చిక్కకుండా ఉండేందుకు బయటకు వస్తారా చూడాలని అంటున్నారు.

English summary
Congress walks out of RS over implementation of AP Reorganisation Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X