టీడీపీ74, జగన్‌పార్టీ15: కాంగ్రెస్‌కు ఆత్మకూరు ఒక్కటే

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్య్రాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క మున్సిపల్ చైర్మన్‌ను దక్కించుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 175 శాసనసభ స్థానాల్లో, 25 లోకసభ స్థానాల్లో ఏ ఒక్కటీ పొందలేక కాంగ్రెస్ పార్టీ చతికిలబడిన విషయం తెలిసిందే.

వాస్తవంగా రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకే అభ్యర్థులు కరవయ్యారు. ఆ పార్టీ తరపున బరిలో నిలిచినవారు సైతం నామమాత్రపు పోటీకే పరిమితయ్యారు. అయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్‌గిరిని మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆత్మకూరు చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన వరమ్మ గెలుచుకుంది.

Congress win Atmakur municipality

గోదావరి జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్

ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్‌స్వీప్ సాధించింది. రెండు కార్పొరేషన్లు సహా ఎన్నికల జరిగిన అన్ని మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, ఏడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయితీ పరిధిలో మేయర్, ఛైర్మన్లు, డిప్యూటీ మేయరు, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు జరిగాయి.

ఒక్క నర్సాపురం మున్సిపాల్టీలో మినహా మిగిలిన అన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించటంతో ఆ పార్టీ అభ్యర్ధులే మేయర్, ఛైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరు నగరపాలక సంస్ధ మొట్ట మొదటి మహిళా మేయర్‌గా షేక్ నూర్జహాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా టిడిపి కార్పొరేటర్ చోడే వెంకటరత్నం కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, నిడదవోలు, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డిగూడెం గెలుచుకుంది. నర్సాపురం మున్సిపాల్టీలో మాత్రం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక తప్పలేదు. ఇక్కడ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెరొక 14 కౌన్సిలర్ స్ధానాలు లభించగా ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్ధులు విజయం సాధించారు. దీనితో ఎన్నిక అనివార్యమయ్యింది. ముగ్గురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు టిడిపికే మద్దతు పలికారు.

నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు (బిజెపి), ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు (ఎమ్మెల్యే) ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఓటు వేయడంతో ఆ పార్టీ అభ్యర్ధి పసుపులేటి రత్నమాల ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా టిడిపికి చెందిన నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

తూర్పు గోదావరిలో రాజమండ్రి కార్పొరేషన్, ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. రాజమండ్రి కార్పొరేషన్‌లో టిడిపి చెందిన పంతం రజనీ శేషసాయి మేయర్‌గా, వాసిరెడ్డి రాంబాబు డిప్యుటీ మేయర్‌గా విజయం సాధించారు. 7 మున్సిపాలిటీల్లో ఎవరి మద్దతు లేకుండానే తెలుగుదేశం పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్ధులు విజయం సాధించారు. గొల్లప్రోలు, ఏలేశ్వరం,సామర్లకోట, రామచంద్రపురం, ముమ్మిడివరం, మండపేట మున్సిపల్ ఛైర్మన్‌గా చుండ్రు వరప్రకాష్ ఎన్నికయ్యారు.

కాగా, మొత్తం 92 మున్సిపాలిటీల్లో రెండింట్లో ఎన్నిక వాయిదా పడింది. 90 మున్సిపాలిటీలలో 74 టీడీపీ, 15 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంది. ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+