రాయల టీ వెనక కుట్ర, రాజధాని ఇబ్బందులే: పొన్నం
న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ భగ్గుమన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనక కుట్ర ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీమాంధ్ర రాష్ట్రం రాజధానికి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తీసుకుని వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.

సమైక్యాంధ్ర పేరుతో రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు ఉద్యోగులను అయోయానికి గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో అందరికీ రక్షణ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని ఆయన గుర్తు చేశారు.
రాయల తెలంగాణ తమకు సమ్మతం కాదని తమ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెబుతామని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు తెలంగాణ సారథ్య బృందం ఢిల్లీ యాత్ర చేపడుతుందని ఆయన మీడియాతో చెప్పారు. ఈ నెల 8వ తేదీన రాజ్‌ఘాట్‌ను సందర్సిస్తామని, 9వ తేదీన సోనియాను కలుస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 10వ తేదీన ప్రదర్శన, చర్చా గోష్టి ఉంటాయని చెప్పారు. ఈ నెల 11, 12 తేదీల్లో తెలంగాణకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల నాయకులను కలుస్తామని ఆయన చెప్పారు.
హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకే మద్దతు ఇవ్వాలని తాము కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కోరినట్లు తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. జైపాల్ రెడ్డితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బ తీయవద్దని ఆయన సూచించారు. 60 ఏళ్లుగా ప్రజలు పోరాటం చేస్తోంది ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రం కోసమేనని ఆన అన్నారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications