పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర.. నిఘావర్గాల హెచ్చరికల వెనుక?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపులలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని, పవన్ కళ్యాణ్ ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద హత్యకు కుట్ర జరుగుతోందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
డిప్యూటీ సీఎంగా పవన్ మార్క్
ఇక తాజా వార్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులలోను, పార్టీ శ్రేణులలోనూ ఆందోళన మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్ ను సాధించి తమ పార్టీ నుంచి పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి పాలనలో తన మార్క్ చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఆ గ్రూప్ ల ఫోన్ కాల్స్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన
అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేయడం పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందని చెప్పడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కొందరి ఫోన్ కాల్స్ ట్రాక్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్టుగా, ఆయన పైన హత్యకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా చెబుతున్నారు.
మోదీవ్యతిరేకుల దృష్టిలో పవన్
పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి సన్నిహితంగా ఉండడం వలన ఆయనపై విద్రోహ గ్రూపుల నజర్ పడిందని, ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ, ఏపీ లోనుఅధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కారణం కావడం వలన మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
పవన్ ను టార్గెట్ చెయ్యటం వెనుక ఇదీ ఒక కారణమేనా?
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని ఆచరించడం, ఆయన పూజలు, ఆరాధనలు, ఆచార వ్యవహారాలు కూడా కొంతమందికే కంటగింపుగా ఉన్నాయని అందుకే పవన్ కళ్యాణ్ పైన కుట్రలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అయితే కేంద్రం నుంచి, జనసేన వర్గాల నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికల జారీపై ఇప్పుడు ఏపీవ్యాప్తంగా చర్చ జరుగుతుంది..












Click it and Unblock the Notifications