వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం వైయస్ జగన్ కుటుంబ ఆస్తుల వివాదం పైన చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీలో వాడి వేడి చర్చ జరుగుతుండగా, తాజాగా టిడిపి పోస్ట్ చేసిన ఒక వీడియో దాని తాలూకు టిడిపి పెట్టిన సంచలన పోస్ట్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర
టిడిపి అధికారిక ఎక్స్ ఖాతాలో వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందని అర్ధం వచ్చేలా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2024 ఎన్నికలకు ముందు వైయస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు బాబాయి వైయస్ వివేకాని లేపేసినట్టే, 2024 ఎన్నికలకు ముందు కూడా విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందని అర్ధం వచ్చేలా టిడిపి పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.

Conspiracy to kill YS Vijayamma shocking post with video in tdp official X account

వైఎస్ విజయమ్మ కారుతో టీడీపీ పోస్ట్
వైయస్ విజయమ్మ కారు వీడియోతో పెట్టిన ఈ పోస్టులో టిడిపి రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు అంటూ షాకింగ్ విషయం చెప్పింది. వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది అని టిడిపి తన అధికారిక ఖాతాలో పేర్కొంది.

సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి. ఏం జరిగిందో ఊహించి ఉంటారు
ఇది సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి అని వెల్లడించింది. ఇంకా నయం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంత హై ఎండ్ కారు, అదీ కొత్త కారుకి ఇలా జరగడం చూసి, ముందు ఆశ్చర్యపోయి, తర్వాత మన సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి, ఏం జరిగిందో చాలా మంది ఊహించారు అంటూ పరోక్షంగా వైఎస్ జగన్ ను టార్గెట్ చేసింది.

లోగుట్టు ఆ కుటుంబానికే ఎరుక!
ఇదంతా జరిగింది 2024 ఎన్నికల ముందు. 2019 ఎన్నికలకు బాబాయ్ ని లేపేసినట్టే... ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగిందని పేర్కొంది. తర్వాత ఏడాది పాటు విజయ రాజశేఖర్ రెడ్డి అమెరికాలోనే ఉన్నారని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి లోగుట్టు ఆ కుటుంబానికే ఎరుక! అంటూ షాకింగ్ ట్వీట్ చేసింది.

టీడీపీ పోస్టు తో షాకింగ్ చర్చ
ఇక ఈ పోస్ట్ ద్వారా అత్యాధునిక హంగులు ఉన్న వైఎస్ విజయమ్మ కారుకు ఒకేసారి రెండు టైర్లు ఎలా ఊడిపోయాయి? ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా వెళ్లి అక్కడే ఎందుకు ఉన్నారు? ఈ ఘటనలో అసలు జరిగింది ఏమిటి? అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలగజేయడంతో పాటు, వైఎస్ విజయమ్మపై హత్యకు కుట్ర జరిగినట్టు టిడిపి పెట్టిన పోస్టుతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+