హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కానిస్టేబుల్ రెండో పెళ్లి: స్టార్ లైఫ్ మోసం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ పోలీసు కానిస్టేబుల్ జైలు పాలయ్యాడు. మొదటి పెళ్లి చేసుకుని మూడు నెలలు కూడా దాటక ముందే పోలీసు కానిస్టేబుల్ మరో పెళ్లి చేసుకున్నాడు. మొదటిది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా, రెండోది ప్రేమ పెళ్లి. మొదటి భార్య ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో అతను విధులు నిర్వహిస్తుండేవాడు. రెండో పెళ్లితో అతను అదే జైలుకు అండర్ ట్రయల్ ఖైదీగా వెళ్లాడు. ఈ సంఘటన హైదరాబాదులోని నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై యాదగిరి అందుకు సంబంధించిన వివరాలను అందించారు.

మహబూబ్‌నగర్ జిల్లా మిర్జిల్ మండలం బొమ్మలరాజుపల్లి గ్రామానికి చెందిన మణికంఠ అలియాస్ మార్కండేయులు (28) చంచల్‌గుడా జైలులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది మే 10వ తేదీన కల్వకుర్తికి చెందిన హరితతో అతనికి పెద్దలు వివాహం చేశారు. ఆ తర్వాత హరితతో అతను నల్లకుంటలో కాపురం పెట్టాడు.

ఆర్యసమాజ్‌లో పెళ్లి

ఆర్యసమాజ్‌లో పెళ్లి

మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత కానిస్టేబులు మణికంఠ అలియాస్ మార్కండేయులుఆగస్టు 6వ తేదీన నార్త్ లాలాగుడాకు చెందిన వినోదకుమారిని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులుగా మణికంఠ ఇంటికి రాకపోవడంతో, తనను పట్టించుకోకపోవడంతో హరిత పుట్టింటికి వెళ్లింది. విషయాన్ని సోదరుడు సత్యనారాయణకు చెప్పింది.

సోదరుడి ఆరా, ఫిర్యాదు

సోదరుడి ఆరా, ఫిర్యాదు

బావమరిది సత్యనారాయణ మణికంఠపై ఆరా తీశాడు. మరో అమ్మాయిని మణికంఠ పెళ్లి చేసుకున్నట్లు అతను తెలుసుకున్నాడు. దాంతో హరిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మణికంఠను అరెస్టు చేశారు.

బోర్డు తిప్పేసిన స్టార్ లైఫ్

బోర్డు తిప్పేసిన స్టార్ లైఫ్

ఇంటి నుంచే పనిచేయండి, శిక్షణ ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌ పి అండ్ టీ కాలనీలో స్టార్ లైఫ్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు వ్యతిరేకంగా బాధితులు ఆందోళనకు దిగారు. కేంద్ర కార్యాలయం చంద్రలోక్ కాంప్లెక్స్‌లో ఉన్నట్లు నిర్వాహకులు చెప్పుకున్నారు.

బోర్డు తిప్పేసిన స్టార్ లైఫ్

బోర్డు తిప్పేసిన స్టార్ లైఫ్

మంగళసూత్రాలు, హారాలు, ఇతర ఆభరణాలు తయారు చేయడంలో శిక్షణ ఇస్తామంటూ స్టార్ లైఫ్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులు ఆశ పెట్టారు. ఒక్కొక్కరి నుంచి 2 వేల నుంచి 15 వేల రూపాయల వరకు వసూలు చేశారు. వందలాది మంది డబ్బులు పెట్టి మోసపోయామని గుర్తించారు.

English summary
Constable arrested for second marriage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X