ఉరేసుకుని హైదరాబాద్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వగ్రామం నుండి తమ బంధువులు రాగా వారికి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు చూపించేందుకు మంగళవారం మధ్యాహ్నం పంపించాడు. వారితో కలిసి భార్య, పిల్లలు కూడా వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మస్తానయ్య ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన భార్య, బంధువులకు ఫ్యాన్‌కు వేలాడుతున్న మస్తానయ్య శవం కనిపించింది. దీంతో వెంటనే విషయాన్ని స్థానిక జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం ఉస్మానియా మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications