చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్ష చేయడం ఏంటన్నా.. మంత్రి పవన్‌పై ట్రోల్స్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేపట్టిన వారాహి అమ్మవారి దీక్ష వివాదాస్పదంగా మారింది. పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పద్ధతిగా నుదుటగా బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించి పవన్ అందర్ని ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఇక్కడే అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
BJP ni meppinchatanika? ..Chepputho dheekshalu ..what a Hindu follower 😆😆 pic.twitter.com/nFYzQJ8YDs
— Sri Reddy (@SriReddyTalks) June 25, 2024
వారాహి అమ్మవారి దీక్ష చేస్తోన్న పవన్ కల్యాణ్ చెప్పులు ధరించడం పలువురు జనాలను షాక్‌కు గురిచేస్తుంది. పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్ష చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించ పరచడమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హిందూమతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కల్యాణ్‌కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనం పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా పవన్ కల్యాణ్ దీక్షలు చేసినప్పుడు చెప్పులు ధరించారు. ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వరస్వామి ఫొటోను చెప్పులు వేసుకునే అందుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నటి శ్రీరెడ్డి స్పందించారు. పవన్ చెప్పులతో అమ్మవారి దీక్ష చేస్తోన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్' అంటూ రెండు పగలబడి నవ్వే బొమ్మలను శ్రీరెడ్డి జోడించింది. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. ఈ 11 రోజులు కూడా కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ ఈ దీక్ష చేపట్టారు.












Click it and Unblock the Notifications