తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Saptagiri Express: తిరుపతి- ఎంంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ పై రైల్వే అధికారులు తాజా సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు కొత్తగా ఎల్‌హెచ్‌బీ బోగీలను అమర్చనున్నారు. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఈ ఎక్స్‌ప్రెస్‌కు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అమర్చిన ఎక్స్ ప్రెస్ ఈ నెల 20వ తేదీన ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు ఇకపై ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. రైలు నంబర్లు 16053/16054, 16057/16058 సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లు ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు మారిన తర్వాత, ఈ రైళ్ల కూర్పులో మార్పులుంటాయి. ఇందులో ఒక ఏసీ చైర్ కోచ్, 10 చైర్ కార్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అదనంగా- దివ్యాంగులకు అనుకూలంగా ఒక సెకండ్ క్లాస్ కోచ్, ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ కూడా ఈ రైళ్లలో ఉంటాయి.

Conventional rakes of the Sapthagiri Express will be replaced with LHB Coaches

జర్మనీకి చెందిన లింకె-హాఫ్మన్- బుష్క్ సంస్థ డిజైన్ చేసిన బోగీలు ఇవి. చెన్నై, పంజాబ్‌లోని కపుర్తలా, రాయ్‌బరేలీల్లో గల రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో ఇవి తయారవుతాయి. ఐసీఎఫ్ రూపొందించిన బోగీలతో పోల్చుకుంటే ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యంగా, విలాసవంతంగా ఉంటాయి. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు రూపొందాయి. యాంటీ టెలిస్కోపిక్, అడ్వాన్స్‌డ్ న్యుమాటిక్ బ్రేక్ సిస్టమ్, యాంటీ కొలిషన్ అవాయిడ్ సిస్టమ్‌ ఇన్- బిల్ట్‌గా ఉంటాయి ఇందులో.

సాధారణ ఐసీఎఫ్ బోగీలతో పోల్చుకుంటే బరువు తక్కువ. లైట్ వెయిట్ మెటల్‌ను దీని తయారీలో వినియోగిస్తారు. 2022లో రైల్వేల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వినియోగం మొదలైంది. మొట్టమొదటిసారిగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై మెయిల్‌కు ఈ కోచ్‌లను అమర్చారు. క్రమంగా వీటిని విస్తరిస్తోన్నారు. గతంలో సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఈ బోగీలను సమకూర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+