corona cases in AP : భారీగా పెరిగిన కేసులతో కరోనా టెన్షన్ .. నిన్న ఒక్కరోజే 2,558 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ కేసుల నమోదు కూడా విపరీతంగా నమోదు అవుతుంది. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,558 మంది కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ప్రభుత్వం కరోనా కట్టిడికి ఎన్ని చర్యలు చేపట్టినా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది .

కరోనాతో గత 24 గంటల్లో ఆరుగురు మృతి

కరోనాతో గత 24 గంటల్లో ఆరుగురు మృతి

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 31,286 నమూనాలను పరీక్షించగా 2,558 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,15,832 గా నమోదయింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 465 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి.

 రాష్ట్రంలో 14,913 కరోనా యాక్టివ్ కేసులు

రాష్ట్రంలో 14,913 కరోనా యాక్టివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా నుండి కోలుకున్నవారు గత 24 గంటల్లో 915 మంది. ఇక తాజా మరణాల తో కలిపి ఏపీలో నమోదయిన మొత్తం మరణాల సంఖ్య 7,268 . ప్రస్తుతం రాష్ట్రంలో 14,913 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా సమాచారం గడచిన 24 గంటల్లో కృష్ణా , గుంటూరు, నెల్లూరు, కర్నూలు ,ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,53,33,851 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,93,651 మంది కరోనా నుండి కోలుకున్నారు.

జిల్లాల వారీగా కేసులివే

జిల్లాల వారీగా కేసులివే

ఇక జిల్లాల వారీగా కరోనా కేసులను చూస్తే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 465 కేసులు, కృష్ణాజిల్లాలో 152 కేసులు, విశాఖపట్నంలో 290 కేసులు, గుంటూరు జిల్లాలో 399 కేసులు నమోదయ్యాయి. అనంతపురం లో 131 కేసులు, నెల్లూరులో 204, కర్నూలులో 344, వైఎస్ఆర్ కడప జిల్లాలో 94 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో 185 కేసులు, ప్రకాశం జిల్లాలో 153 కేసులు ,విజయనగరంలో 46 కేసులు ,తూర్పుగోదావరి జిల్లాలో 58 కేసులు నమోదు కాగా పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 37 కేసులు నమోదయ్యాయి.

 లాక్ డౌన్ , నైట్ కర్ఫ్యూ లపై అపోహలు

లాక్ డౌన్ , నైట్ కర్ఫ్యూ లపై అపోహలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు రాష్ట్ర ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది . ఎప్పుడు ఏం జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ విధిస్తారా ? నైట్ కర్ఫ్యూ విధిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. కేసులు పెరుగుదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడికి అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, మార్గనిర్దేశం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+