ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. కొత్తగా 1,257 కేసులు.. చిత్తూరును చుట్టేసి వైరస్
ఆంధ్రప్రదేశ్ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 1,257 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ ముంచుకోస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.
ఒక్కరోజులు 1257 కొత్త కేసులు
ఏపీలో కరోనా వ్యాప్తి పెరిగింది. గత మూడు రోజులలోనే బాధితల సంఖ్య రెట్టింపు అయింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్థారణకు 38,479 శాంపిల్స్‌ను పరీక్షించింది. వారిలో 1,257 మందికి పాజిటివ్ గా తేలినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా గుంటూరు, విశాఖ పట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
యాక్టివ్ కేసులు 4,774
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,16,05,951 శాంపిల్స్ పరీక్షించింది. వాటిలో 20,81,859 మంది కరోనా సోకింది. వారిలో 20,62,2580 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 14,505 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 4,774 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వివరించింది.

3చిత్తూరులో కరోనా విజృంభణ
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 254 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తర్వాత విశాఖ 196, అనంతపురం 138, కృష్ణా 117, గుంటూరులో 104, తూర్పు గోదావరిలో 93 మందికి పాజిటివ్ గా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 140 మంది కరోనా నుంచి కొలుకున్నారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా సోకినవారికి మెరుగైన వైద్యం అందిస్తునట్లు తెలిపింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా నిబంధనలు తప్పని సరిగా పాటించాలని.. పాంటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications