కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఊగిసలాడుతున్న కరోనా కేసులు: తాజాగా 215 కొత్త కేసులు, ఒక్కరు మృతి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కాస్త హెచ్చుతగ్గులతో కేసుల నమోదు కొనసాగుతుంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 215 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీలో 30,381 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. అంతకు ముందు రోజు 150 కొత్త కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు.

కరోనా మహమ్మారి నుండి నిన్న ఒక్కరోజే 406 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వారి కంటే కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 3,568 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోలుకున్న 406 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 20,49,961గా ఉంది . ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,67,921 గా నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,392 గా ఉంది.

 Corona in AP: 215 new cases recently, one person died with covid 19

ఇక గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరు మృతి చెందారు. ఇదిలా ఉంటే జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో 26 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చిత్తూరు జిల్లాలో 33 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 17 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 12 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 24 కరోనా కేసులు, కృష్ణా జిల్లాలో 37 కరోనా కేసులు నమోదయ్యాయి.

వైఎస్ఆర్ కడప జిల్లాలో 11 కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 10 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 27 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 12 కేసులు, అనంతపూర్ జిల్లాలో 4 కేసులు, కర్నూలు జిల్లాలో ఒక్కరు , విజయనగరం జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులలో తగ్గుదల కనిపిస్తున్నా కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని చెప్తున్నారు. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పదేపదే చెప్తున్నారు.

English summary
In the last 24 hours, 215 new cases of corona were reported in AP. Corona diagnostic tests, according to state medical health department statistics one person died with covid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X