మాంసం ప్రియులూ జర జాగ్రత్త!: పూడ్చిన మాంసం, కుళ్లిన చేపలు అమ్ముతున్నారు!
నెల్లూరు: ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తుంటే కొందరు మాత్రం తమకేమీ పట్టనట్లు అత్యంత నిర్లక్ష్యంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చైనాలో గబ్బిలం తినడం ద్వారానే కరోనావైరస్ వ్యాప్తి చెందినట్లు వార్తలు రావడంతో అక్కడ గబ్బిలం మాంసాన్ని తినడం మానేశారు. అంతేగాక, మాంసం తినే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.
Recommended Video

పూడ్చిపెట్టిన మాంసాన్ని తీసుకొచ్చి..
ఇది ఇలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెంకటగిరిలో మాత్రం పలువురు విక్రయదారులు ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం మాంస విక్రయాలపై పలు ఆంక్షలు విధించినప్పటికీ.. వీరు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఏకంగా తినడానికి వీల్లేని ప్రభుత్వ అధికారులు పూడ్చి పెట్టగా.. ఆ మాంసాన్ని తీసుకొచ్చి ప్రజలకు విక్రయిస్తున్నారు.

ఇంత దారుణమా?
వెంకటగిరిలో క్రాస్ రోడ్డు వద్ద ఓ వ్యాపారి వద్ద 25 కేజీల పాట్టేలు మాంసం, గొడ్డేరు వాగులో వధించిన ఆవు తల, త్రిభువని కూడలి వద్ద 16 కోళ్లను మున్సిపల్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. కాగా, పట్టుకున్న మాంసాన్ని డంపింగ్ యార్డులో పాతిపెట్టే వేళ 9 కేజీలు, 8 కోళ్లు మాత్రమే ఉండటం గమనార్హం. అయితే, పూడ్చిపెట్టిన మాంసాన్ని కూడా పలువురు వ్యాపారులు తిరిగి తీసుకెళ్లి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

పోలీసుల హెచ్చరిక
ఎన్టీఆర్ కాలనీ శివారులో ఓ ఇంట్లో దాచిన చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల క్రిందటి చేపలను ఐస్ పెట్టోల్లో ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అధికారులు, పోలీసులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు మాంసానికి దూరంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం తెలిసిందే.

ఏపీలో క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు
ఇది ఇలావుండగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఉదయం వరకు మరో 12 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో గుంటూరులో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నాయి. కాగా, గుంటూరులో అత్యధికంగా 90 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లాలో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనాతో ఏపీలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 413 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications