దంపతులు ఆత్మహత్య: విశాఖలో బాంబు కలకలం

గోడ కూలి ఇద్దరు మృతి
గంటూరు జిల్లాలోని చిలకూలూరిపేటలో బుధవారం ఉదయం ఓ గోడౌన్ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
సెల్ టవర్ పేల్చివేత
ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు మరో విధ్యంసానికి పాల్పడ్డారు. దమ్ముగూడెం మండలం కొత్తపల్లి దగ్గర గత రాత్రి సెల్‌టవర్‌ను మావోయిస్టులు పేల్చేశారు. పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమానికి అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలంటూ పలు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పోస్టర్లను అంటించారు. ఆదివాసీలకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వాలపై అన్ని సంఘల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పోస్టర్లలో పిలుపునిచ్చారు. బుధవారం డిజిపి పర్యటన నేపథ్యంలో మావోయిస్టులు సెల్‌టవర్ పేల్చడం కలకలం రేపంది.
బాబు కలకలం
విశాఖపట్నం నగరంలోని రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేగింది. లోకమాన్య తిలక్ రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టారంటూ ఫోన్ రావడంతో జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని తరలిస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడు హైదరాబాద్‌లో స్పిఫర్ డాగ్స్ ట్రైనింగ్ సెంటర్‌లో డాగ్ హ్యాండలర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications