విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపి మంత్రి నారాయణపై కేసు నమోదుకు ఆధేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Court directs police to book AP minister Narayana for cheating
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పి. నారాయణకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై చీటింగ్, విశ్వాస ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది.

ఓ పేరెంట్ వేసిన కేసుపై ఫస్ట్ అడిషినల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మొహమ్మద్ రఫీ మంగళవారం ఆ ఆదేశాలు జారీ చేశారు. నారాయణపై ఐపిసి 403, 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆయన విజయవాడ మాచవరం పోలీసులను ఆదేశించారు.

వివరాలు ఇలా ఉన్నాయి - విశాఖపట్నంలో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐతా రామలింగేశ్వర రావు తన కుమారుడు రామసాయిని విజయవాడలోని నారాయణ విద్యాసంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐఐటి కోచింగ్ బ్రాంచ్‌లో చేర్పించారు.

అయితే, బోధనా ప్రమాణాలు ఆశించిన మేరకు లేవనే విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ గానీ యజమానులు గానీ పట్టించుకోలేదు. ప్రమాణాలను నిరూపించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలూ చేయలేదు. దాంతో రావు తన కుమారుడిని అక్కడి నుంచి తీసి మరో కాలేజీలో వేశారు. తనకు రూ.20,400 రూపాయలను తిరిగి ఇవ్వాలని రావు కోరారు.

అయితే, తనంత తాను కాలేజీ నుంచి కుమారుడిని తీసివేసుకున్నందున తాము ఫీజు తిరిగి ఇవ్వబోమని కళాశాల అధికారులు చెప్పారు. దాంతో రామలింగేశ్వర రావు కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.

English summary

 Vijayawada city court has directed Machavaram police to file a criminal case and hold investigation against a corporate school in connection with a private case filed in 2013 by one A. Ramalingeswara Rao of Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X