భారత్ లో చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0: సినిమాటిక్ కొలాజ్: షార్ట్ ఫిల్మ్స్ తీసిపడేయ్యొచ్చు
ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కీలక ప్రకటన చేశారు. చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 ఏఐ టూల్ ఉపయోగించి భారత్ బిలియన్ కంటే ఎక్కువ ఇమేజెస్ సృష్టించారని వెల్లడించారు. భారత్ లో ఈ ఇమేజ్ జనరేషన్ టూల్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, ఇప్పటికే భారీ సంఖ్యలో క్రియేషన్స్ జరిగాయని పేర్కొన్నారు. కిందటి వారమే ఈ టూల్ అందుబాటులోకి రాగా.. అతి కొద్ది రోజుల్లోనే బిలియన్ కు పైగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి.
దీనిపై ఆల్ట్‌మన్ తాజాగా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. "చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 ఇండియా. ఇప్పటికే బిలియన్ కంటే ఎక్కువ ఫొటోలు క్రియేట్ చేశారు. ఇది అద్భుతం.." అని రాశారిందులో. దీనికి గ్రీన్ హార్ట్ ఎమోజీని యాడ్ చేశారు. భారత్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కు అత్యంత ఆదరణ ఉందనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ కోణంలోనే సామ్ ఆల్ట్‌మన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రారంభంలోనే బిలియన్ ఇమేజీలకు పైగా ఏఐ ఫొటోలు రూపుదిద్దుకోవడం ఇదే మొదటిసారి.

భారత సోషల్ మీడియా యూజర్లు సినిమాటిక్ పోర్ట్రెయిట్‌లు, కంటెంట్, సృజనాత్మక ఎడిట్‌లు, డిజైన్ డెవలప్మెంట్, ప్రొఫెషనల్ విజువల్స్‌తో సహా వివిధ అవసరాల కోసం ఇమేజ్ జనరేషన్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ మొదలుకుని అన్ని కేటగిరీల్లోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజీల కోసం ఛాట్ జీపీటీ 2.0 టూల్ ను వినియోగిస్తోన్నారు. వీటన్నింటి సహకారంతో ఓ షార్ట్ ఫిల్మ్ నే తీసిపడేస్తోన్నారు.
ఓపెన్‌ఏఐ గతంలో చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0ని విడుదల చేసింది. ఇన్ స్టంట్ యుటలైజేషన్ విజువల్స్‌ను అందించడం దీనికి ఉన్న గొప్పదనం. ఇప్పటివరకు అందుబాటులో లేనివిధంగా, ఎవరూ చూడని స్థాయిలో, మన ఆలోచనలకు అనుగుణంగా ఆయా సినిమాటిక్ పోర్ట్రెయిట్‌లను కొలాజ్ చేయొచ్చు. ఎడిట్ చేయవచ్చు. దానికి తగ్గట్టుగా కంటెంట్ సైతం అందిస్తుందీ చాట్ జీపీటీ. దీంతో ఈ టూల్ వినియోగం భారీగా ఉంటోంది భారత్ లో.
ఈ మోడల్‌ను "ఇమేజ్ జనరేషన్‌లో కొత్త శకం"గా అభివర్ణించింది.. ఓపెన్‌ఏఐ. టెక్ట్స్ రెండరింగ్, మల్టీ లింగ్వల్, విజువల్ అసెస్మెంట్ అందిస్తుందని తెలిపింది. చాట్‌జీపీటీ ఇమేజెస్‌తో రూపొందించిన ఓ వీడియోను ఓపెన్ఏఐ ట్వీట్ చేసింది. అందులో చూపించిన దృశ్యాలు వాస్తవికతను ప్రతిబింబించాయి. చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 అన్ని చాట్‌జీపీటీ, కోడెక్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటోందని ఓపెన్‌ఏఐ తెలిపింది.
ChatGPT Images 2.0 💚 India.
— Sam Altman (@sama) May 18, 2026
Already more than 1 billion images created there; awesome to see.
ఈ మోడల్‌ను యాక్సెస్ చేయడానికి, వినియోగదారులు చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0ని సందర్శించాలని కోరింది. అందులో Try in ChatGPT అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే హెడ్‌షాట్స్, కామిక్స్, 3డీ అవతార్, అనిమే వంటి అనేక విభిన్న శైలో ఉండే ఇమేజెస్, గ్రాఫిక్స్ కంటెంట్ అందులో కనిపిస్తాయి. యూజర్లు తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. పాత ఫొటోలను అప్‌లోడ్ చేయడం లేదా కొత్త ఇమేజీలను రూపొందివచ్చు.












Click it and Unblock the Notifications