బహిరంగంగా మద్యం సేవించిన మందుబాబులకు వింత శిక్ష వేసిన కోర్టు!
మందు బాబులం.. మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేము మహారాజులం అంటూ తాగి బహిరంగ ప్రదేశాలలో చిందేసే మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బనగానపల్లి కోర్టు సరికొత్త శిక్ష వేసింది. ఇంకెప్పుడూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా ఉండే విధంగా వారికి వేసిన వింత శిక్షను ఇటీవల అమలు చేశారు.
మందుబాబులకు సరికొత్త శిక్ష వేసిన జడ్జి
నంద్యాల జిల్లా బనగానపల్లి లో బహిరంగ ప్రదేశాలలోనే మద్యం సేవిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పిన తీరు మార్చుకోని ఈ మందుబాబుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వీరిని కోర్టులో హాజరుపరచగా బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారికి సరికొత్త శిక్ష విధించింది.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్లకార్డుల ప్రదర్శన
మందేసి చిందేసే వీరంతా మద్యపానం చేయడం వల్ల కలిగే అనర్ధాలు, ట్రాఫిక్ రూల్స్ తదితర విషయాలను ప్రజలకు తెలిసేలా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలలో నిల్చోవాలని తీర్పునిచ్చింది. పలు గ్రామాలకు చెందిన 47 మంది మద్యం ప్రియులను గుర్తించి సోమవారం నాడు న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరు పరచగా వారిని పరివర్తన కోసం న్యాయమూర్తి షేక్ అబ్దుల్ రెహమాన్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
మద్యం సేవించటం వల్ల కలిగే అనర్ధాలను తెలిపేలా
దీంతో వీరంతా మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలను రహదారి నిబంధనలను ప్లకార్డులపైన ప్రదర్శిస్తూ బనగానపల్లిలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద కాసేపు, బహిరంగ ప్రదేశాల వద్ద నిల్చుని వచ్చిపోయే జనాలకు తెలియజేశారు. వీరికి కోర్టు విధించిన శిక్షణ అమలు చేసేలా స్థానిక పోలీసులు చూశారు. తాగి అడ్డంగా దొరికిన వీరంతా తాగొద్దని అందరికీ ప్రచారం చేశారు.
బహిరంగ మద్యపానం చెయ్యకుండా చక్కని పనిష్మెంట్
రోడ్డుపై బహిరంగ ప్రదేశాలలో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్లకార్డులు పట్టుకు నిలబడ్డ వారు వారిలో వారే సిగ్గుతో చచ్చిపోయారు. బహిరంగంగా మద్యపానం చేసిన దానికి ఫలితం అనుభవించామని వారు చెప్తున్నారు. ఇంకా ఎప్పుడూ పొరబాటున కూడా బహిరంగ మ,మద్యపానం చేయమని వారు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications