జగన్ కేసు: హాజరు మినహాయింపుపై తీర్పు రిజర్వ్
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ ప్రత్యేక కోర్టులో బుధవారంనాడు వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నందున వైయస్ జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వవద్దని సిబిఐ కోర్టును కోరింది.

పలు కారణాలతో జగన్ వాయిదాలు కోరుతుండడం వల్ల అభియోగాల నమోదు ముందుకు సాగడం లేదని చెప్పింది. జగన్‌కు మినహాయింపు ఇస్తే కోర్టులో విచారణ ప్రక్రియపై ప్రభావం పడుతుందని సిబిఐ వాదించింది. అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే.
జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి జగన్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బెయిల్ ఇచ్చినప్పుడు పెట్టిన షరతుల్లో కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. ఢిల్లీ వెళ్లడానికి, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి, రాష్ట్రంలో పర్యటించడానికి జగన్‌కు కోర్టు వెసులుబాటు కల్పించింది.












Click it and Unblock the Notifications