మాజీ ఎమ్మెల్యే సి.కె.బాబుపై బాంబు దాడి కేసులో తుది తీర్పు
చిత్తూరు:చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి.కె.బాబు పై బాంబు దాడి కేసులో 9వ అదనపు కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎ 1 నిందితుడిగా కఠారి మోహన్, ఎ 2గా చింటులకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి కబర్తి తీర్పు నిచ్చారు. మరో 13 మందిని నిర్థోషులుగా ప్రకటించారు.
మొత్తం 17 మంది నిందితుల్లో ఎ1 కఠారి మోహన్ తో సహా ముగ్గురు గతంలోనే మృతి చెందారు. 2007లో సంవత్సరంలో కట్టమంచిలోని మురుగునీటి కాలువ కల్వర్టు వద్ద సికె బాబుపై చింటూ, కఠారి మోహన్‌లు హత్యాయత్నం చేశారు. మేయర్ కటారి అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడుగా ఇప్పటికే వైఎస్‌ఆర్ కడప జిల్లా సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు తుది తీర్పు సందర్భంగా కోర్టు ఆవరణంలో 144 సెక్షన్ విధించారు. అలాగే భధ్రతా చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు.
సీకే బాబు సహా 81మంది సాక్షుల్ని పోలీసులు చేర్చగా, కోర్టు 51 మందిని విచారించి 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు నేడు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి.కె.బాబు, ఆయన సతీమణి సి.కె.లావణ్యల 25వ వివాహ మహోత్సవం కావడం విశేషం.
మొత్తం 17 మంది నిందితుల్లో ఎ1 కఠారి మోహన్ తో సహా ముగ్గురు గతంలోనే మృతి చెందారు. 2007లో సంవత్సరంలో కట్టమంచిలోని మురుగునీటి కాలువ కల్వర్టు వద్ద సికె బాబుపై చింటూ, కఠారి మోహన్‌లు హత్యాయత్నం చేశారు. ఈ కేసు విషయంలో ఎ2 చింటు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications