వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: బిగ్ రిలీఫ్ -మళ్లీ సున్నాకు మరణాలు -కొత్తగా 125 కేసులు

|
Google Oneindia TeluguNews

టెస్టుల సంఖ్య తగ్గించనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ భారీగా పడిపోయాయి. కరోనా మరణాలు మల్లీ సున్నాకు పడిపోయాయి. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు కనిష్ట స్థాయికి పడిపోయాయి. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 42,809 టెస్టులు నిర్వహించగా, కొత్తగా 125 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 8,87,591కి చేరింది. ఇక..

 covid-19 in ap: 125 new cases, no deaths in last 24 hrs

రాష్ట్రంలో కరోనా మరణాలు మళ్లీ సున్నాకు పడిపోయాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరు కూడా చనిపోలేదని బులిటెన్ లో పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,152గా కొనసాగుతోంది.

కొత్త కేసులు తగ్గడంతోపాటు డిశ్చార్జిల సంఖ్య కూడా పెరిగాయి. గురువారం ఒక్కరోజే 175 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 8,79,131కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్‌ కేసులు 1,308కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,30,54,959 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

కొత్త కేసులకు సంబంధించి కృష్ణా జిల్లాలో అత్యధికంగా 26 కొత్త కేసులు, కడప, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా ఒక్కో కేసు నమోదైంది. అలాగే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 21 ఉన్నాయి.

English summary
Andhra Pradesh reported 125 fresh COVID-19 cases, taking the tally to over 8.87 lakh, while no deaths were reported for the second consecutive day, in 24 hours ending 9 am on Friday. The state also reported 175 more recoveries, a health department bulletin said. With 42,809 tests, the total number of tests conducted stood at over 1.30 croreso far in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X