కృష్ణా జిల్లాలో గోమాతకు సీమంతం .. వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా సంబరం !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో గర్భం దాల్చిన ఒక ఆవుకు గ్రామస్తులంతా కలిసి ఘనంగా సీమంతం నిర్వహించారు. గ్రామస్తులంతా అంగరంగ వైభవంగా గోమాతకు సీమంతం నిర్వహించారు. గోవు పవిత్ర జంతువని, సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి స్వరూపం అని భావించి గ్రామంలోని మహిళలు అందరూ గోమాతకు సీమంతం నిర్వహించారు. గోమాతను చక్కగా అలంకరించి, వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా పసుపు కుంకుమలతో లక్ష్మీ స్వరూపమైన గోమాతను పూజించారు.

గోమాతకు సీమంతం చేసిన ఏపీలోని వడ్లమాను గ్రామం

గోమాతకు సీమంతం చేసిన ఏపీలోని వడ్లమాను గ్రామం

ఇంట్లో ఆడబిడ్డకు సీమంతం చేస్తే ఎంత హడావిడి చేస్తారో అంత హడావిడి చేశారు . ఊరంతా ఈ సీమంత కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. హిందూ ధర్మంలో ఆవుకు ప్రతేక స్థానం ఉందని, ఎక్కడైతే గోమాత పూజలు అందుకుంటుందో అక్కడ ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుంటారని భావిస్తారు. ఈ క్రమంలోనే గోవుకు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించాలని వడ్లమాను గ్రామస్తులు కోరుతున్నారు. ఎక్కడైతే గోమాతను పూజిస్తారో ఆ గ్రామంలో పాడిపంటలు పుష్కలంగా ఉంటాయని వారు అంటున్నారు.

గోమాతకు పట్టు వస్త్రాలు, పూలు పండ్లు సమర్పించి సీమంతం

గోమాతకు పట్టు వస్త్రాలు, పూలు పండ్లు సమర్పించి సీమంతం

గోమాతకు సీమంత కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన రెడ్డి ప్రసాద్ నిర్వహించారని గ్రామస్తులు చెప్తున్నారు. గోమాతకు పట్టు వస్త్రాలు, పూలు, గాజులు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించి సీమంతం చేశారు . మహిళలు గోమాత సీమంతానికి చక్కని పాటలు పాడి అలరించారు. ఆవు గొప్పతనం, ఆవులో ఉండే దైవత్వం అర్ధం అయ్యేలా చక్కని పాటలను పాడారు. ఈ వేడుక చూడటానికి ఊరంతా తరలి వచ్చారు. గ్రామంలోని మహిళలంతా గోమాతకు పండ్లు తినిపించారు.

 ఊరంతా భోజనం పెట్టి వైభవంగా గోమాత సీమంతం

ఊరంతా భోజనం పెట్టి వైభవంగా గోమాత సీమంతం

50 కిలోల పులిహోర, ముప్పై కిలోల లడ్లు, వివిధ రకాల పిండి వంటలతో ఊరంతా భోజనం పెట్టి సీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోవు గొప్పతనం హిందూ ధరం చాటి చెప్తుందని, అందుకే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాతను పూజించాలని మహిళలు అంటున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలంటే పవిత్రమైన గోమాత ఆశీస్సులు ఉండాలని వారంటున్నారు. గోమాత శరీరమే దేవతలకు నెలవు అని చెప్తున్నారు. పరమ పవిత్రమైన గోవుల పట్ల భక్తి ఉండాలని వారంటున్నారు.

గతంలో తెలంగాణాలోని హన్మకొండలోనూ గోమాతకు సీమంతం


గతంలోనూ అనేక చోట్ల గోవులకు సీమంతం చేసిన ఉదంతాలు ఉన్నాయి. గతంలో హనుమకొండ ఎస్బిహెచ్ కాలనీకి చెందిన వీరేశం దంపతులు కూడా గోమాతకు అంగరంగ వైభవంగా సీమంతం చేశారు. వీరేశం దంపతులకు నలుగురు కుమారులు . వారికి కూతుళ్ళు లేకపోవడంతో , రెండో కుమారుడు తల్లిదండ్రులు గోవుల పట్ల చూపించే ప్రేమను గుర్తించి ఒక గోవును తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చారు . దీంతో వారు ఆ ఆవునే తమ బిడ్డలా భావించి ఎంతో ప్రేమతో గోమాతను పెంచుకున్నారు. ఆ ఆవు గర్భం దాల్చటంతో వారు పట్టరాని సంతోషానికి లోనై సొంత కూతురికి నిర్వహించినట్లుగా, హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవుకి సీమంతం చేశారు. చాలా అట్టహాసంగా ఒక ఆడపిల్లకు తల్లిదండ్రులు ఎలాగైతే సీమంతం చేస్తారో అలాగే గోవుకు కూడా సీమంతం జరిపారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+