అసెంబ్లీలో జెసికేం పని?: రామకృష్ణ, వనజాక్షిపై చంద్రబాబు తప్పు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.
కాల్ మనీ కేసులో ఆరోపణలను ఎదుర్కుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులను విచారించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా బిల్లులను ఆమోదింపజేసుకోవడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో ఇద్దరిదీ తప్పేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడం తప్పని ఆయన అన్నారు. రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
పార్లమెంటుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ శానససభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి ఏం పని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications