పవన్‌తో సీపీఐ నేతల భేటీ!: లెఫ్ట్‌కు జనసేన దగ్గరవుతోందా? (వీడియో)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : పవన్ పొలిటికల్ అడుగులను నిశితంగా పరిశీలిస్తే.. భవిష్యత్తు రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి ఆయన అడుగులు వేయనున్నారా! అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. లెఫ్ట్ పార్టీల నేతలు కూడా పవన్ కళ్యాణ్‌ను సమర్థించేలా అడపాదడపా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

CPI leaders met Janasena Pawan Kalyan!

తాజాగా ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు పవన్‌తో భేటీ అవడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో గల జనసేన కార్యాలయంలో పవన్ తో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నోట్ల రద్దు తర్వాత సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు లాంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

సమావేశం సందర్బంగా.. వామపక్ష పార్టీల భావజాలాన్ని పవన్ కళ్యాణ్ అభినందించినట్టుగా సమాచారం. కాగా, ప్రస్తుతానికి వీరి మధ్య రాజకీయ చర్చలేవి లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో వీరి మధ్య స్నేహం చిగురించే అవకాశాలు లేకపోలేవు అన్న అభిప్రాయాలకు ఈ భేటీ ఊతమిచ్చేదిగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CPI leader Ramakrishna and MLC Chandrashekhar Rao was met Janasena President Pawan kalyan. On thursday at Janasena office in Jubilihills meeting was happened
Please Wait while comments are loading...