'స్వాతంత్ర్య సమరయోధురాలా?: జయలలితని మోడీ ఎలా అభినందిస్తారు'

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అనుకూలంగా కోర్టు తీర్పు రాగానే ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారని, అలా స్పందించేందుకు జయలలిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా? అని సీపీఐ నేత నారాయణ గురువారం ప్రశ్నించారు.

కోర్టు తీర్పులనూ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని నిరూపిస్తే సమ్మెను నిలిపివేయాలని చెప్పేందుకు తాము సిద్దమే అన్నారు.

CPI Narayana criticises Narendra Modi for wishing Jayalalitha

ప్రభుత్వాల వల్లే నష్టాలు వస్తున్నాయని తాము నిరూపిస్తే మంత్రి పదవులకు రాజీనామాలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారా అని ఏపీ, తెలంగాణ మంత్రులకు సవాల్ చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా గురువారంనాడు జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఆందోళన కొనసాగిస్తామన్నారు.

భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సీపీఐ జైల్‌భరో

భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సీపీఐ ఆధ్వర్యంలో జైల్‌భరో కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‌లోని కలెక్టరు కార్యాలయం ఎదుట సీపీఐ నేతలు ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న కార్యకర్తల్ణను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+