ఆ నాటికి మోడీ చెల్లని నోటే: నారాయణ సెటైర్లు, ‘ఏపీని నాశనం చేస్తున్నారు’

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫెయిలైందని సీపీఐ నేత నారాయణ అన్నారు.

అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫెయిలైందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. డబ్బులున్న వాళ్లందరూ తెల్లదొరలుగా మారారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు మేమున్నమన్న భరోసా బడ్జెట్ ఇవ్వలేకపోయిందని అన్నారు.

రాజకీయంగా ఎన్డీయే ఫెయిలైందని సీపీఐ నారాయణ అన్నారు. బీజేపీ మతాల పేరుతో రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చెల్లని నోటుగా మిగిలిపోతారని అన్నారు.

cpi narayana on union budget

అమరావతికి భూములిచ్చిన రైతులకు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు కూడా మూలదధన లాభాల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. మొదట బీజేపీ, ఆ పార్టీ నేతలు ఆస్తులను ప్రకటించిన తర్వాత ఇతర పార్టీల విరాళాల గురించి మాట్లాడాలని నారాయణ అన్నారు.

ఏపీని నాశనం చేస్తున్నారు: చలసాని

కేంద్ర బడ్జెట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఫిబ్రవరి 10వ తేదీనుంచి ఇచ్ఛాపురం నుంచి హిందూపురం హోదా కోసం పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు.

రాష్ట్ర పోర్టుల వియంలో అన్యాయం జగరుతున్నా.. ఒక్కనాయకుడు మాట్లాడటం లేదని శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఒక్కపైసా కేటాయించలేదని ధ్వజమెత్తారు. విభన చట్టంలో ఉన్న అంశాలను ఎందుకు అమలు చేయరని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+