జగన్ ఓడిపోతే అవే కారణం-మార్చాల్సింది అభ్యర్ధుల్ని కాదు-సీపీఐ నారాయణ కామెంట్స్..
ఏపీ రాజకీయాలపై సీపీఐ నారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయాలతో పాటు వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై నారాయణ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఏపీకి లింక్ చేస్తూ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు తీర్పుపైనా ఆయన మండిపడ్డారు.
ఏపీలోనూ తెలంగాణ ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతున్నాయని సీపీఐ నారాయణ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యేలకు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్రాన్ని దోచేసిన తరువాత ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ఉపయోగమేంటని నారాయణ ప్రశ్నించారు. ఇన్చార్జ్ లు, ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు.. వైసీపీలో సీఎం అభ్యర్థినే మార్చాలన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, పాలన చేతకాకపోవడం వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలు కాబోతున్నాయని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి అదే గాల్లోనే కలిసిపోతాడన్నారు. పొగరు, అవినీతి, అహంకారానికి కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. బైజ్యూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆయన కోరారు. బైజ్యూస్, బజాజ్ కార్యాలయాలను పగులగొట్టాలని నారాయణ పిలుపునిచ్చారు.

తుపాను వల్ల తిరుపతి జిల్లాలో 60వేల ఎకరాల్లో వరిపంట నష్టం జరిగిందని, 18లక్షల ఎకరాలలో అన్ని రకాల పంట నష్టం జరిగిందని నారాయణ తెలిపారు. మిచౌన్ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్ము కాశ్మీర్ 370 అర్టికల్ పైన వచ్చిన తీర్పు దురదృష్టకరమని నారాయణ వెల్లడించారు. న్యాయ వ్యవస్థ ఒక పంజరంలోని చిలుకగా మారిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీలకు దాని ప్రాధాన్యత ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అందుకే 370 ఆర్టికల్ గురించి వారికి తెలియడం లేదన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications