వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ లేఖల వెనుక బెయిల్ రద్దు కోణం ? సానుభూతి కోసమే - సీపీఐ నారాయణ షాకింగ్‌

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ తాజాగా వ్యాక్సిన్లపై ముఖ్యమంత్రులకు రాసిన లేఖల కలకలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జగన్ రాసిన లేఖలపై విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తుండగా.. తాజాగా సీపీఐ సీనియర్‌ నేత నారాయణ కూడా దీనిపై స్పందించారు. జగన్ లేఖల వెనుక అసలు కారణాన్ని ఆయన బయటపెట్టారు దీంతో ఇప్పుడు నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకు ముంచి జగన్‌ బెయిల్‌ రద్దుపై జరుగుతున్న చర్చకు మరింత ఊతమిచ్చాయి..

 జగన్‌ లేఖలపై సర్వత్రా చర్చ

జగన్‌ లేఖలపై సర్వత్రా చర్చ

కేంద్రం వ్యాక్సిన్ల విధానంపై కలిసి కట్టుగా ఉందామంటూ తాజాగా ఏపీ సీఎం జగన్.. తొటి ముఖ్యమంత్రులకు రాసిన లేఖలపై దుమారం కొనసాగుతోంది. గతంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ వ్యాక్సిన్లపై ప్రధానిని టార్గెట్‌ చేసినప్పుడు ఆయన్ను వారిస్తూ ట్వీట్లు పెట్టిన జగన్.. ఇప్పుడు సీఎంలకు లేఖలు రాయడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ లేఖలకు వెనుక అసలు కారణాల్ని వెతికే పనిలో విపక్ష నేతలు బిజీగా కనిపిస్తున్నారు.

జగన్‌ లేఖల వెనుక షాకింగ్‌ రీజన్

జగన్‌ లేఖల వెనుక షాకింగ్‌ రీజన్


వ్యాక్సిన్లపై ఉమ్మడి పోరాటం చేద్దామంటూ సీఎంలను కోరుతూ తాజాగా ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలపై సీపీఐ నారాయణ స్పందించారు. జగన్ లేఖల వెనుక ఉన్నఅసలు కారణాన్ని ఆయన బయటపెట్టారు. ఉన్నట్లుండి సీఎం జగన్‌ తోటి ముఖ్యమంత్రులకు లేఖలు అందుకే రాశారంటూ ఇవాళ తిరుపతిలో వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటివరకూ ఏపీలో విపక్షాలు దీనిపై సాగిస్తున్న చర్చను ఆయన మరికాస్త ముందుకు తీసుకెళ్లారు.

Recommended Video

Anantapur : అత్యాధునిక సౌకర్యాలతో కోవిడ్ హాస్పిటల్ ప్రారంభించిన Ys Jagan || Oneindia Telugu
 బెయిల్‌ రద్దు వేళ సానుభూతి కోసమే

బెయిల్‌ రద్దు వేళ సానుభూతి కోసమే

జగన్‌ తన బెయిల్ రద్దవుతుందని ఊహించి కేంద్రంపై పోరాడుతున్నట్లు నటిస్తూ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో జార్ఖండ్ సీఎం సోరెన్ లేఖ రాసినప్పుడు ఆయన్ను వారించిన జగన్ ఇప్పుడు ఎందుకు తోటి సీఎంల మద్దతు కూడగడుతున్నారని నారాయణ ప్రశ్నించారు. తద్వారా జగన్ బెయిల్ రద్దుపై నారాయణ కూడా క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ లేఖల వెనుక సానుభూతి కోణం ఉందన్న నారాయణ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మాత్రం స్పందించలేదు.

English summary
cpi senior leader narayana on today termed andhrapradesh cm ys jagan's recent lettes to chief ministers on vaccines are nothing but a plan to gain sympathy over his bail cancellation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X