అందరూ నా కొడుకేమో అనుకుని ఫోన్లు, బాధ కలిగించింది: నారాయణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ చిన్నవయస్సులోనే మృతి చెందడం బాధాకరమని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఎంతో జీవితం అనుభవించాల్సిన యువకుడు ఆకస్మికంగా చనిపోవడం తనను కలిచివేసిందన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ చిన్నవయస్సులోనే మృతి చెందడం బాధాకరమని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఎంతో జీవితం అనుభవించాల్సిన యువకుడు ఆకస్మికంగా చనిపోవడం తనను కలిచివేసిందన్నారు.

ఉదయం నుంచీ ఫోన్లూ
ఇది దురదృష్టకరమైన ఘటన అని నారాయణ అన్నారు. కాగా, ప్రమాద వార్త తెలిసిన కొందరు తన కుమారుడు చనిపోయాడనుకుని బుధవారం ఉదయం నుంచి తనకు ఫోన్ చేస్తున్నారని.. అప్పుడే తనకు మంత్రి నారాయణ కుమారుడు చనిపోయిన విషయం తెలిసిందని చెప్పారు.

ప్రాణం తీసుకురాలేం
ఈ ప్రమాదం నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని, విలువైన జీవితాన్ని వృథాగా కోల్పోకూడదని నారాయణ అన్నారు. ఎంత డబ్బులున్నా పోయిన ప్రాణాలను తీసుకురాలేమన్నారు.

మంచి స్నేహితుడు
ఏపీ మంత్రి నారాయణ వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని చెప్పారు. ఆయన కుటుంబంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం తనకు బాధ కలిగించిందని నారాయణ చెప్పారు.

తెల్లవారుజామునే..
బుధవారం తెల్లవారుజామునే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ(22), అతడి స్నేహితుడు రవిచంద్ర మృతి చెందారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురువారం నెల్లూరులో నిశిత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications