శ్రీవారిని దర్శించుకున్న నారాయణ
చిత్తూరు: దేశాన్ని పట్టి పీడిస్తున్న నిజమైన ఆర్ధిక నేరస్తులందరు పార్లమెంట్, రాజ్యసభలో దర్జాగా కూర్చొని ఉన్నారని సిపిఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చాలా సంవత్సరాల తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ సందర్బంగా ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నల్ల ధనంపై జరుగుతున్న యుద్దానికి సామాన్యులు మాత్రమే ఇబ్బందులు చవి చూస్తున్నారని, దేశాన్ని అడ్డంగా దోచుకున్న ఆర్ధిక దోపిడీ దారులు 270 మంది లోకసభలో, 160 మంది రాజ్యసభలో దర్జాగా కుర్చున్నారని తీవ్ర విమర్శలు చేసారు.












Click it and Unblock the Notifications