వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఫూల్స్ చేసేందుకు మరోసారి బీజేపీ పావులు'

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP Unsure About Govt's Assurance On AP Bifurcation Act

అమరావతి: నవ్యాంధ్ర ప్రజలను మరోసారి ఫూల్స్ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోందని సీపీఐ నైత రామకృష్ణ ఆదివారం మండిపడ్డారు. ఏపీకి ఇవి ఇచ్చామంటూ బీజేపీ ఎంపీ హరిబాబు శనివారం లెక్క చెప్పిన విషయం తెలిసిందే. ఈ లెక్కతో చంద్రబాబు ఇరకాటంలో పడినట్లుగా భావించారు.

అయితే, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే మనకు ఇచ్చారని, విభజన హామీల మేరకు ఇవ్వలేదని, లెక్కకు లెక్కతో సమాధానం చెప్పాలని చంద్రబాబు అధికారులను, నేతలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా త్వరలో లెక్కలు తీసే అవకాశముంది.

ఏపీకి మరో శుభవార్త, విశాఖ రైల్వే జోన్‌కు ఒకే!: అలా ఐతేనే.. మారిన బాబు వ్యూహం, ఆ తర్వాతేఏపీకి మరో శుభవార్త, విశాఖ రైల్వే జోన్‌కు ఒకే!: అలా ఐతేనే.. మారిన బాబు వ్యూహం, ఆ తర్వాతే

ప్రజలను మోసం చేశారు

ప్రజలను మోసం చేశారు

ఈ నేపథ్యంలో రామకృష్ణ స్పందించారు. ఏపీ ప్రజల్ని మరోసారి ఫూల్స్‌ను చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్నారు. ఈ మేరకు ఆయన బీజేపీ ఎంపీ హరిబాబుకు బహిరంగ లేఖ రాశారు. అమలు కాని ప్రకటనలతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లు ప్రజలను మోసం చేశారన్నారు.

నాలుగేళ్లలో ఇవ్వనిది రెండేళ్లలో ఇస్తామంటే నమ్మాలా

నాలుగేళ్లలో ఇవ్వనిది రెండేళ్లలో ఇస్తామంటే నమ్మాలా


ఈ ప్రకటనలు వినీ విని విసిగిన ఏపీ ప్రజలకు మళ్లీ కేంద్రం పాతపాటే వినిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఏపీకి నాలుగేళ్లలో ఇవ్వలేని నిధులు రెండేళల్లో ఇస్తామంటే ప్రజలు నమ్మాలా అని అడిగారు.

ముష్టి రూ.50 కోట్లతో జిల్లా అభివృద్ధి సాధ్యమా

ముష్టి రూ.50 కోట్లతో జిల్లా అభివృద్ధి సాధ్యమా

ఏడాదికి రూ.50 కోట్ల ముష్టితో ఒక జిల్లా అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు. కాగా, ఏపీకి బీజేపీ ఏం చేసిందో వివరించడానికి తాను సిద్ధమని, అన్ని వివరాలు తన దగ్గర ఉన్నాయని ఆ పార్టీ నేత హరిబాబు పేర్కొనడంతో పాటు పూర్తి వివరాలు శనివారం వెలల్డించారు.

ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు

ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు

ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని ప్రముఖ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు అన్నారు. రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీ కింద రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్థఇకంగా ఎంతో వెనుకబడి ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు ఏపీకి కేంద్రం సాయం చేయాలన్నారు. ఆర్థికలోటును కేంద్రం ఎలా భర్తీ చేస్తుందో చెప్పాలన్నారు.

English summary
CPI Ramakrishna said on Sunday that BJP is trying to cheat A people again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X