అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ రూట్ లో జగన్ - పవన్ కు ఛాన్స్ ఎక్కడ : ఇక తెగదెంపులే : రామకృష్ణ సంచలనం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో బీజేపీ - జనసేన పొత్తు కొనసాగింపు పైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలో భాజపా - జనసేన తెగదెంపులు ఖాయమని తేల్చి చెప్పారు. బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ లో జగన్ వెళ్తున్నారని..ఇప్పుడు పవన్ కళ్యాన్ కు రోడ్ మ్యాప్ ఎందుకు ఇస్తారని రామక్రిష్ణ ప్రశ్నించారు. తొందరలోనే పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సదస్సులో బీజేపీ నేతలు..వైసీపీ ప్రభుత్వం పైన తనకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని పవన్ చెప్పుకొచ్చారు. త్వరగా ఇవ్వాలని కోరారు.

పవన్ వ్యాఖ్యలతో కొత్త చర్చ

పవన్ వ్యాఖ్యలతో కొత్త చర్చ


ఆ తరువాతనే తాను కొత్త పొత్తుల పైన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసారు. అదే సమయంలో వైసీపీని ఓడించటమే తన లక్ష్యమని స్పష్టం చేసారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని తేల్చి చెప్పారు. దీని పైన బీజేపీ ఏపీ నేతలు స్పందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలోనే రోడ్ మ్యాప్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇక బీజేపీ నుంచి పవన్ కు అందే రోడ్ మ్యాప్ ఏమీ ఉండదనే వాదన మొదలైంది.

పొత్తులకు సంకేతాలు ఇవేనంటూ

పొత్తులకు సంకేతాలు ఇవేనంటూ


ఇదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని చెప్పటం ద్వారా..పవన్ కళ్యాణ్ పరోక్షంగా టీడీపీతో పొత్తుకు సంకేతాలు ఇచ్చారనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఏపీలో గత ఎన్నికల్లో బీఎస్సీ - వామపక్షాలతో పొత్తు కొనసాగించిన..జనసేన ఆ తరువాత బీజేపీతో జత కట్టింది. కానీ, ఏపీలో మారుతున్న సమీకరణాలతో తిరిగి బీజేపీ - జనసేన- టీడీపీ పొత్తు కడతాయా, లేకుంటే బీజేపి తిరిగి టీడీపీతో కలిసేందుకు ముందుకు రాకుంటే..టీడీపీ - జనసేన పొత్తు కుదురుతుందా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది.

బీజేపీ కలుస్తుందా .. ఆ రెండు పార్టీలేనా

బీజేపీ కలుస్తుందా .. ఆ రెండు పార్టీలేనా


ఇక, రామకృష్ణజంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వెంటనే వారి కుటుంబాలను జగన్ పరామర్శించాలన్నారు మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, ఏపీలో రానున్న ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో జూలై నుంచి మరింత వేగంగా సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
CPI State secretary Ramakrishna sensational comments on BJP - Janasena alliance. He says their relation come to an end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X