మోదీ, చంద్రబాబు కలసి...ఎపిని ముంచారు:సిపిఎం రాఘవులు;సిపిఐ బంద్
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచారని సీపీఎం నేత రాఘవులు ధ్వజమెత్తారు. అన్నీ తెలిసి కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని రాఘవులు ఆరోపించారు. ఏపీ పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమను తెలుగు దేశం పార్టీ కప్పిపెడుతూనే వచ్చిందని ఆయన దుయ్యబట్టారు.
ఇప్పుడు చంద్రబాబు తెలివిగా తప్పును కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని రాఘవులు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అని ఇన్నాళ్లూ ఊరించారు...అది ఉత్తిదే అని తేలిపోయిందన్నారు. బాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని రాఘవులు ఆరోపించారు.

మరోవైపు కేంద్రబడ్జెట్‌పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై ఈనెల 8న సీపీఐ రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నామని, అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని ఆయన కోరారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications