చంద్రబాబుకు మీరు తొత్తులా : జగన్ శత్రువు కాదు: రామకృష్ణ మనస్థాపం- పార్టీ నేతల సీరియస్..!!
చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని మేం వినలేకుండా ఉన్నాం. ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించేరా...అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు ఆ పార్టీ నేతలు క్లాస్ పీకిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుండి రామకృష్ణ దాదాపుగా చంద్రబాబు కు మద్దతుగా ప్రతీ అంశంలోనూ వ్యవహరిస్తున్నారు. అమరావతి అంశంతో పాటుగా..టీడీపీ లైన్ లోనే జగన్ పైన విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది.

చంద్రబాబుకు తొత్తులా..ఎందుకిలా..
సీపీఎం నేతలు చంద్రబాబుకు దూరంగా ఉండగా..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్వయంగా చంద్రబాబుతో అంత సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఏంటనే చర్చ మొదలైంది. గతంలోనే వైసీపీ నేతలు సైతం రామకృష్ణ తీరును తప్పు బట్టారు. రామకృష్ణ టీడీపీ నేతగా మారిపోయారంటూ విమర్శలు చేసారు. అమరావతి కోసం నిధుల సేకరణ పేరుతో నాడు చంద్రబాబు అనేక ప్రాంతాల్లో జోలి పట్టి విరాళాలు సేకరించారు. ఆయనకు మద్దతుగా అందులో రామకృష్ణ సైతం పాల్గొనటం పైన అప్పట్లో నే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి.

రామకృష్ణ కు క్లాస్ పీకిన పార్టీ నేతలు..
ఇక, చంద్రబాబు ఏ ధర్నా చేసినా.. నిరసన ప్రకటించినా.. రామకృష్ణ ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తూ పార్టీ నిర్ణయంగా ప్రచారం జరగటం పైన పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే..చాలా కాలం తరువాత విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం లో రామకృష్ణ పార్టీ నేతలకు టార్గెట్ అయ్యారు. రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నా.. వారికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు. పదే పదే చంద్రబాబు కు మద్దతిస్తూ...సీఎం జగన్ ను విమర్శిస్తున్న కారణంగా ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వారు నిలదీసినట్లు సమాచారం.

నారాయణ సమక్షంలోనే...ప్రశ్నల దాడి..
పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు డాక్టర్ కే నారాయణ సమక్షంలోనే రామకృష్ణపై పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా రాష్ట్ర కార్యదర్శి వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగానే ఆరోపించారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ విధానం కాగా.. కార్పొరేట్లకు వంత పాడుతూ, బడా సంస్థలకు సీఈఓనని చెప్పుకునే చంద్రబాబుతో అంటకాగాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు రామకృష్ణను నిలదీశారు.

జగన్ పైన వ్యక్తిగతంగా విమర్శలు దేనికి..
పాలనా పరంగా లోపాలు ఎత్తిచూపడం వేరు.. జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం వేరంటూ పార్టీ సీనియర్ నేత మండిపడ్డారు. కార్యదర్శి నివేదికలో పేర్కొన్న పలు అంశాలను మార్చాలని పట్టుబట్టి మార్పించారు. వైఎస్ జగన్ కమ్యూనిస్టుల ప్రత్యర్థి కాదని, ఆయన సంక్షేమ పథకాలను స్వాగతిస్తూనే ఏమైనా లోపాలుంటే విమర్శిద్దామని.. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపొద్దని రామకృష్ణకు హితవు చెప్పారు. ఈ వ్యవహారంలో సీపీఎం వ్యవహరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

చంద్రబాబు తీరు మర్చిపోయారా..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బడుగువర్గాలపట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో మరచిపోకూడదని కూడా ఆ నేతలు సలహా ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలేవీ లేవని గుర్తు చేసిన సీపీఐ నేతలు... టీడీపీ, వైఎస్సార్‌సీపీతో సమదూరంగా ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందామంటూ ప్రతిపాదించారు. సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిద్దా మంటూ సూచించారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషిచేద్దామని...పార్టీ రాష్ట్ర మహాసభలకు శ్రేణులను సిద్ధంచేసేలా కింది నుంచి పార్టీ శాఖలను నిర్మించుకుందామని పిలుపు నిచ్చారు.

రామకృష్ణ మనస్థాపం - సంజాయిషీ..
దానిపై దృష్టిసారించాలంటూ పార్టీ నేతలు రాష్ట్ర కార్యదర్శికి సూచించారు. దీనిపై రామకృష్ణ వివరణ ఇస్తూ.. పార్టీ విధానం ప్రకారమే నడుచుకుంటున్నానని, జగన్ తనకేమీ శత్రువు కాదని చెప్పారు. పార్టీ నాయకత్వం సూచించిన తీరులో ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తున్నట్లు సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఈ దశలో నారాయణ సర్దిచెప్పడానికి ప్రయత్నించినా రామకృష్ణపై విమర్శల దాడి కంటిన్యూ అయింది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు కారణమైంది. తాను జగన్ కు వ్యతిరేకం కాదని..చంద్రబాబుకు అనుకూలం కాదంటూ రామకృష్ణపై సంజాయితీ ఇచ్చిన తరువాత వివాదం ముగిసింది.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications