వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాక్సైట్ తవ్వకాలు: 'శ్వేతపత్రం అబద్ధాల మయం, పచ్చి బూటకం' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: లక్షమంది పోలీసులు వచ్చినా విశాఖ మన్యంలోని బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. మంగళవారం దాబా గార్డెన్స్ లోని ఓ హోటల్‌లో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటైన కార్యక్రమంలో 'ప్రస్తుత రాజకీయ పరిణామాలు' అనే అంశంపై ప్రసంగించేందుకా ఆమె విశాఖకు వచ్చారు.

ప్రజా సమస్యలపై జాతీయ స్థాయిలో ఆరు వామపక్ష పార్టీలతో కలిసి పోరాడాలని నిర్ణయించామన్నారు. వివిధ ప్రజా సంఘాలు, సంస్థలను కులుపుకుని ముందుకు వెళ్లినప్పుడు మతతత్వ పార్టీ బీజేపీని నిలువరించగలమన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సీపీఎం చేరువ కావాలన్నారు.

ఇటీవల విశాఖలో జరిగిన సీపీఎం 21వ అఖిల భారత మహాసభలో చేసిన పలు తీర్మానాలపై కార్యాచరణ రూపొందించేందుకు డిసెంబర్ నెలాఖరున కోల్‌కత్తాలో నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మరింతగా చర్చిస్తామన్నారు. భారతదేశంలో పుష్కలంగా వనరులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో దాదాపు 6 లక్షల కోట్ల రిజర్వ నిధులు ఉన్నాయని వాటితోనే ఇక్కడ మరిన్ని పరిశ్రమలు పెట్టవచ్చని ఆమె తెలిపారు.

'లక్ష మంది పోలీసులు వచ్చినా బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరు'

'లక్ష మంది పోలీసులు వచ్చినా బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరు'

అనంతరం విశాఖ మన్యంలోని బాక్సైట్ గనులు, విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల మయమని, పచ్చి బూటకమని ఆమె అన్నారు.

'లక్ష మంది పోలీసులు వచ్చినా బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరు'

'లక్ష మంది పోలీసులు వచ్చినా బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరు'

బాక్సైట్ ఉన్న నాలుగు బ్లాకులలో ప్రజలు నివసించడం లేదని, వన్యప్రాణులు లేవని శ్వేతపత్రంలో చెప్పారని, కళ్లజోడు మార్చుకుని చూస్తే అన్ని కనబడతామయని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల కోసం మన్యంలోకి అడుగుపెడితే గిరిజనులంతా అల్లూరి సీతారామరాజును స్పూర్తిగా తీసుకుని పోరాడాలని ఆమె పిలుపు నిచ్చారు.

'లక్ష మంది పోలీసులు వచ్చినా బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరు'

'లక్ష మంది పోలీసులు వచ్చినా బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరు'

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని సైతం అడ్డుకుంటామన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ఎయిర్ పోర్టు ప్లానింగ్ ఉందని ఆమె అన్నారు. మంగళవారం పార్టీకి చెందిన నేతలతో కలసి భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలో ఆమె పర్యటించారు.

'లక్ష మంది పోలీసులు వచ్చినా బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరు'

'లక్ష మంది పోలీసులు వచ్చినా బాక్సైట్ గనుల్లో కిలో మట్టి కూడా తీయలేరు'

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశంలోని ఇతర ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగులను తొలగిస్తుంటే... భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. పార్లమెంటులో సైతం ఈ విషయాన్ని లేవనెత్తుతామని చెప్పారు.

English summary
The CPM condemns all attempts of the Andhra Pradesh government to take up bauxite mining in the Eastern Ghats of Visakhapatnam district and the party will fight the move, as it will ruin the environment and disrupt the livelihood of tribals living in the area, according to Brinda Karat, senior CPM leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X