కంచుకోటల్లో క్రాస్ ఓటింగ్ - ఆ పార్టీ ఆశలపై నీళ్లు..!!
ఏపీలో ఎన్నికల పోలింగ్ లో అనూహ్య పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. గతం కంటే ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదలైంది. పెరిగిన పోలింగ్ శాతం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గెలుపు పైన ప్రధాన పార్టీలు పైకి ధీమాగా ఉన్నా..లోలోపల టెన్షన్ పడుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ ప్రచారం ఇప్పుడు కూటమి పార్టీలకు కంటి మీద కునకు లేకండా చేస్తోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
హోరా హోరీ
గోదావరి జిల్లాల్లో అయిదు పార్లమెంట్, 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. మూడ పార్టీల కూటమికి ఇక్కడ సామాజిక సమీకరణాలు..ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంచనా వేసారు. ఇక్కడ జగన్ పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్..తన పథకాల పైనే నమ్మకం పెట్టుకున్నారు. పోలింగ్ పూర్తయింది. అయిదు పార్లమెంట్ స్థానాల్లోనూ భారీ పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళి పైన ప్రధాన పార్టీలు కసరత్తు చేసాయి. పోల్ అయిన ఓట్లు ఎవరికి ఎన్ని దక్కాయనేది తేల్చే పని మొదలు పెట్టాయి. మరో వైపు పలు సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే అనూహ్య అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

క్రాస్ ఓటింగ్ తో
పోలింగ్ సరళి పైన విశ్లేషణ సమయంలో లింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారంతో క్రాస్ ఓటింగ్ పెద్దయెత్తున జరిగిందని చెబుతున్నారు. మూడు పార్టీల అభ్యర్దులు బరిలో నిలిచారు. మూడు గుర్తుల పైన పోటీచేసారు. ఇంటింటి ప్రచారంలోనూ ఎవరికి వారే తమ గుర్తును ప్రచారం చేసుకుని వెళ్లారు. మూడు గుర్తులు చెబితే ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురవుతారని భావించి మూడు పార్టీలూ కూడా ఒక గుర్తు ను మాత్రమే ప్రచారం చేసి వెళ్లారు. అయితే కొన్ని చోట్ల రెండు గుర్తులకు ఓటు వేయాల్సి వచ్చింది. ఇది ఇబ్బందిగా మారింది. కాకినాడ పార్లమెంటుకు జనసేన అభ్యర్థి పోటీ చేయగా, రాజమండ్రి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. అసెంబ్లీ అభ్యర్దులు మరో గుర్తుతో పోటీలో ఉన్నారు.
ఫలితం తారు మారు
గోదావరిలో జిల్లా కేంద్రంగా ఉన్న ఒక కీలక నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే లెక్కలు బయటకు వస్తున్నాయి. అయితే, అనూహ్యంగా అదే అభ్యర్ది గెలుపు పైన పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి. మరో జిల్లా కేంద్రంగా ఉన్న ఎంపీ సీటులో ఊహించని విధంగా ఎమ్మెల్యేకు ఒక విధంగా మద్దతు తెలిపిన ఓటర్లు..ఎంపీ స్థానంలో మాత్రం వారి ప్రత్యర్ధికి ఓటు వేసినట్లు లెక్కల ద్వారా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా మారిన మరో ఎంపీ నియోజకవర్గంలోనూ స్థానిక సమీకరణాల ఆధారంగా పోలింగ్ జరగటం ప్రధాన పార్టీకి మింగుడు పడటం లేదు. దీంతో.. ఇప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ ప్రభావం తో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications