తెలంగాణ ఉద్యోగులకు షాక్: ఆర్డర్ టు సర్వ్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఉద్యోగులను ఎక్కడికి కేటాయిస్తే అక్కడ పని చేయాలని సిఎస్ మహంతి తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులకు శుక్రవారం తేల్చి చెప్పారు. ఆర్డర్ టు సర్వ్ నిబంధన ప్రకారం ముందు ఏ వివాదాలకూ తీవు ఇవ్వకుండా ముందు పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.
మూడు నెలల పాటు ఇది అమలులో ఉంటుంది. ఉద్యోగుల విభజన అంశంపై రోజురోజుకూ ముదురుతున్న వివాదానికి స్వస్తి చెప్పాలంటూ మహంతి శుక్రవారం సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చెప్పారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, జూన్ నెలాఖరు నుంచే ఉద్యోగులకు పోస్టింగులు అమలులోకి వస్తాయి. జూన్ 9 వ తేదీన హెచ్ఓడిలతో కమిటీలను నియమించనున్నారు. ఉద్యోగులు తమకు సంబంధించిన ఆక్షేపణలు ఏమైనా ఉంటే వాటిని సమర్పించవచ్చునని తెలిపారు. జూన్ 15 నుంచి అటువంటి అభ్యంతరాలను స్వీకరిస్తారన్నారు.
ఆర్డర్ టు సర్వ్ నిబంధన గురించి సిఎస్ ఉటంకించడం తెలంగాణ ఉద్యోగులకు మింగుడు పడని విషయం. జూన్ 1 అర్థరాత్రికే ఉద్యోగుల విభజన జరుగుతుందని మహంతి చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే జూన్ 2 నుంచి 9 వరకు తెలియజేయాలన్నారు. ముందుగా సచివాలయం, హెచ్ వోడీ, ఆఫీసులు, జోనల్ పోస్టులకు సంబంధించి అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు.












Click it and Unblock the Notifications