రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా..!?
పెరుగు ప్రతీ ఇంటా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఆహారంలో తీసుకుంటారు. కొందరు మాత్రం పెరుగు కు దూరంగా ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా అందరూ తీసుకునే ఆహారం పెరుగు. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పెరుగు నేరుగా తీసుకోవటం ఇష్టం లేని వారు లస్సీ, మజ్జగిగా తీసుకుంటారు. పెరుగు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. అయితే రోజూ పెరుగు తినడం మంచిదేనా? అన్న సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
పెరుగు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. రోజూ పెరుగు తినవచ్చని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. రుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని ద్వారా లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి ప్రమాదకర మైన బ్యాక్టీరియా తగ్గుతుంది. దీనితో పాటు మన శరీరంలోని వాపు సమస్యలకు చెక్ పెడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో పెరుగు కలిపి తింటే మరిన్ని లాభాలుంటాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ గట్‌లోని ప్రత్యక్ష బ్యాక్టీరియా, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో, పోషకాలను వెలికితీయడంలో సహాయపడుతుంది. పెరుగు ఈ మంచి బ్యాక్టీరియా సంఖ్యను నిర్వహించడానికి సహాయపడుతుంది. కాగా, ప్రతిరోజూ భోజనం తర్వాత పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని చెబుతున్నారు.

నిపుణులు సూచనలు
అదే విధంగా పెరుగు తినడం వల్ల కడుపు సమస్యను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. ఇది మన శరీరానికి కావల్సినంత నీటిని అందిస్తుంది.పేగులో వచ్చే మంటను నియంత్రణలో ఉంచుతుంది. పెరుగు తినడం వల్ల కొద్దిపాటి విటమిన్ బి12 లభిస్తుంది. మీరు అలసట లేదా బలహీనతతో బాధపడుతుంటే, పెరుగు తినండి. దీన్ని తినడం వల్ల ఎనర్జీ, ఫ్రెష్ నెస్ రావడంతోపాటు అలసట అనిపించదు. ప్రతిరోజూ పరిమిత మోతాదులో పెరుగు తినడం ద్వారా మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొన్ని అలర్జీలు.. ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications