పవన్ సభకు రూ.500 పోటు!: అనంత సభలో అభిమానులకు తిప్పలేనా!
అనంతపురం : ప్రస్తుతానికి అంతా.. రూ.500నోటు బాధితులే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సామాన్య మధ్య తరగతి జనాన్ని ఎటూ ఈ తిప్పలు వెంటాడుతుంటే.. పొలిటికల్ మీటింగ్స్ కు, సినిమా షూటింగ్స్ కు సైతం ఈ సెగ తగులుతోంది. ఎక్కువ డినామినేషన్ నోట్ల రద్దు కారణంగా.. ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్ రద్దు అయినట్టుగా వార్తలు వచ్చాయి.
ఇక గురువారం నాడు జరగబోయే జనసేన మీటింగ్ కు ఈ సెగ తగలబోతుందా? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. భారీ ఎత్తున జరగబోయే ఈ సభ కోసం జన సమీకరణ చేయడం మామూలుగా అయ్యే పని కాదు. ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి.. భారీ మొత్తంలో జనం వస్తే.. వారికి సంబంధించిన రవాణా ఏర్పాట్లు చేయడానికి ఎక్కువగా రూ.500, రూ.1000నోట్ల మీదే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది.

ప్రైవేటు వాహనాదారులు ఈ నోట్లను నిరాకరిస్తుండడంతో.. సభకు తరలివచ్చే భారీ జనానికి ఇక్కట్లు తప్పేలా లేవు. అలాగే సభ సందర్బంగా స్థానికంగా ఉండే హోటల్స్, రెస్టారెంట్లు, ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో పవన్ సభకు హాజరుకావాలనుకున్న అభిమానులకు రూ.500నోటు ఓ పోటుగా పరిణమించినట్టైంది.
అంత భారీ జనానికి భోజన వసతి ఏర్పాటు చేయడం అయ్యే పని కాదు. జనసేన నేతలు తీసుకొచ్చే జనమైనా.. సొంతంగా తరలివచ్చే అభిమాపనులైనా.. ఈ కష్టాలను ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ కష్టాలను గట్టెక్కి జనసేనాని సభను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారా అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications