సగం ఏపీపై అక్వాన్ తుఫాన్ ముప్పు..! తేల్చేసిన ఐఎండీ- తీరం దాటే ప్లేస్, ముహుర్తం ఇవే..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది. ఈ రాత్రికి ఇది అక్వాన్ తుఫాన్ గా (Cyclone Akvan) పరిణామం చెందబోతోంది. రేపటి కల్లా అది తీవ్ర తుఫాన్ గా, ఎల్లుండికి అతి తీవ్ర తుఫాన్ గా మారబోతోంది. అనంతరం ఏపీలోనే తీరం దాటబోతున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) ఇవాళ నిర్ధారించింది. అలాగే ఈ అక్వాన్ తుఫాన్ ఎప్పుడు, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందో అంచనాలను కూడా వెల్లడించింది. అలాగే సగం ఏపీ తీరంపై ఈ తుఫాన్ ముప్పు ఉంటుందని తెలిపింది.

వైసీపీలో జగన్ భారీ ప్రక్షాళన ? ముహుర్తం ఖరారు-30-70 మందిపై వేటు?
వైసీపీలో జగన్ భారీ ప్రక్షాళన ? ముహుర్తం ఖరారు-30-70 మందిపై వేటు?

ఇవాళ సాయంత్రం తర్వాత అక్వాన్ తుఫాన్ గా మారబోతోందని, ఈ నెల 20న తీవ్ర తుఫాన్ రూపంలో ఇది ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు-తుని మధ్య తీరం దాటబోతున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ సమయంలో గాలుల తీవ్రత 145 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తోంది. దీని ప్రభావం కచ్చితంగా 500 కిలోమీటర్ల తీరంపై ఉండొచ్చని తెలిపింది. అంటే సగం ఆంధ్రప్రదేశ్ పై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆరంభ అంచనాల్లో ఇది ఉత్తరాంధ్రపై ప్రభావం చూపించవచ్చని భావించినా.. తాజా అంచనాల్లో మాత్రం మచిలీపట్నం కేంద్రంగా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Cyclone Akvan to Make Landfall Between Nellore and Tuni by November 20 Noon IMD
Cyclone Akvan: ఏ తీరానికి అక్వాన్ తుఫాన్ ? అరేబియా-బంగాళాఖాతం మధ్య పోటీలో ..!
Cyclone Akvan: ఏ తీరానికి అక్వాన్ తుఫాన్ ? అరేబియా-బంగాళాఖాతం మధ్య పోటీలో ..!

ఇప్పటికే గత నెల రోజుల కాలంలోనే అర్నబ్ తుఫాన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద తీరం దాటగా.. మురసు తుఫాన్ ఒంగోలు వద్ద తీరం దాటింది. ఇప్పుడు ఈ అక్వాన్ తుఫాన్ మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 1977 నాటికి దివిసీమ ఉప్పెన సహా పలు తుఫాన్లు ఇక్కడే తీరం దాటిన చరిత్ర ఉంది. దీంతో ఈ తీరం మరోసారి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.
అక్వాన్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో గురువారం, శుక్ర‌వారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముందని ఏపీ ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి తీర‌ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచిస్తోంది. ముఖ్యంగా మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో వేట‌కు వెళ్ల‌రాదని హెచ్చరించింది. అలాగే అధికారుల్ని కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+