తీరం తాకిన ఫెంగల్ తుపాను: ఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్, విమానాలు రద్దు

ఫెంగల్ తుపాను (Fengal Cyclone) శనివారం రాత్రి పుదుచ్చేరి సమంలో తీరాన్ని తాకింది. మహాబలిపురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

గడిచిన 6 గంటల్లో 7 కి.మీ వేగంతో కదిలిన ఫెంగల్ తుపాను.. శనివారం రాత్రి 11.30 గంటల సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Fengal hits coast Red alert for coastal areas of AP and Tamil Nadu

తుపాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపైనా తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దాదాపు 20 సెం.మీ వర్షపాతంతోపాటు ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. తమిళనాడులోని చెన్నై, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసింది.

ఫెంగల్ తుపాను ప్రభావంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. మరోవైపు, చెన్నై నుంచి వెళ్లాల్సిన, చెన్నైకి రావాల్సిన పలు విమానా సర్వీసులు కూడా తుపాను కారణంగా నిలిచిపోయాయి.

ఫెంగల్ తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. తుపాను కారణంగా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. తీరప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తుపాను ప్రభావం తగ్గే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+